Moviesపండగ పూట మహేశ్ బాబు ని తీవ్రంగా హర్ట్ చేసిన చిరంజీవి.....

పండగ పూట మహేశ్ బాబు ని తీవ్రంగా హర్ట్ చేసిన చిరంజీవి.. ఈ షాక్ అస్సలు ఊహించలేదుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి.. మహేష్ బాబును తీవ్రంగా హర్ట్ చేసారా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి తర్వాత నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు . వరుసగా సెలవులు కలిసి రావడంతో ఆగస్టు 12 రెండో శనివారం ..కాగా 13 ఆదివారం ..15 ఇండిపెండెన్స్ డే మధ్యలో 14 వర్కింగ్ అయినప్పటికీ అది లెక్కలోకి రాదు అంటూ ఆ టైమ్ చూస్ చేసుకున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి అన్న విధంగా ఆలోచించి భోళాశంకర్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే కరెక్ట్ గా అదే టైంకి మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు . త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగస్టు 11న విడుదల చేయాలి అనేది నాగ వంశీ ఆలోచన . ఈ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టేసాడు .

కాగా ఆ మాటలు లెక్కచేయని మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ టీం .. ఉగాది సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల చేయబోతున్నాం అంటూ అఫీషియల్ ప్రకటన ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన మహేష్ బాబు సినిమా తన సినిమాను వాయిదా వేసుకోలేక అదే టైంకి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట . అయితే ఈ క్రమంలోనే చిరంజీవి అయినా సరే తన టీం కి చెప్పి ఉండాలి కదా అంటూ మహేశ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని మహేష్ బాబు సైతం చిరంజీవి తీసుకున్న డెసిషన్ కి తీవ్రంగా హార్ట్ అయినట్లు తెలుస్తుంది . చూడాలి మరి ఇద్దరి హీరోల్లో ఎవరి సినిమా హిట్ అవుతుందో.. ఎవరి సినిమా జనాలని మెప్పిస్తుందో . టాలీవుడ్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news