MoviesRRR ఆస్కార్ కోసం..10 కోట్లు బెట్ కట్టిన టాలీవుడ్ హీరో..!?

RRR ఆస్కార్ కోసం..10 కోట్లు బెట్ కట్టిన టాలీవుడ్ హీరో..!?

ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా..అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఆస్కార్ అవార్డు వరించింది . ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఫిలిం అందుకొని అరుదైన ఘణత అందుకుంది. రణం రౌద్రం రుధిరం అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ .. నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టితెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది .

కాగా ఫైనల్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును సైతం అందుకోవడం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సరికొత్త సంచలనాన్ని క్రియేట్ చేసింది . కాగా ఇండియన్స్ జనరల్ గా ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు భారీ స్థాయిలో బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు కోట్లలో బెట్టింగ్ జరుగుతుంది. అందుకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుస్తుందా ..? లేదా..? అన్న దానిపై కోట్లలో బెట్టింగ్ జరిగినట్లు సమాచారం అందుతుంది.

అంతేకాదు టాలీవుడ్ బడా హీరోగా పేరు సంపాదించిన స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో కొడుకు కూడా 10 కోట్లు బెట్టింగ్ పెట్టిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆర్ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ విన్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సన్ ఏకంగా 10 కోట్లను పెట్టి సుమారు 50 కోట్లను గెలుచుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని ఆ టాలీవుడ్ హీరో సన్ చేసిన గెస్సింగ్ ఏమో కానీ ఇలా బెట్టింగ్ పెట్టడం ఏంటి అంటూ సదరు హీరో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కర్ గెలిచినందుకు ఆనందపడాలో లేదా మన టాలీవుడ్ స్టార్ హీరోకి ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి అని బాధపడాలో తెలియక అల్లాడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆ స్టార్ హీరో కొడుకు పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news