MoviesRRR ఆస్కార్ స్పెషల్: నాటు నాటు పాటకి రాహుల్ సిప్లిగంజ్ ఎంత...

RRR ఆస్కార్ స్పెషల్: నాటు నాటు పాటకి రాహుల్ సిప్లిగంజ్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు వేచి చూసిన కల నెరవేరింది . దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఏ సినిమా అందుకొని అరుదైన ఘనతను సాధించుకుంది ఆర్ ఆర్ ఆర్. ఈ క్రమంలోనే ఆస్కార్ నామినేషన్ లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో రాహుల్ సిప్లగంజ్ , కాలభైరవ పాడిన నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ ఫైనల్ లిస్టులోకి ఎంటర్ అయ్యి.. ఫైనల్ గా అవార్డు కూడా అందుకుంది.

అంతేకాదు ఫస్ట్ టైం ఆస్కార్ చరిత్రలోనే ఇండియన్ సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఆస్కార్ స్టేజిపై ఇవ్వడం సంచలనంగా మారింది . ఆ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నాయి. కాగా నిజానికి రాజమౌళి ఈ సాంగ్ లిరిక్స్ విన్నప్పుడే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకునేశారట . మరీ ముఖ్యంగా సాంగ్ కొరియోగ్రఫీ టైంలో కూడా రాజమౌళి పాటపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారట . ఫైనల్లీ అదే జరిగింది.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాట పాడిన కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్ ఒక్కొక్కరు ఈ పాట పాడినందుకు ఐదు లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్లు తెలుస్తుంది. అన్ని వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాకు పాట పాడిన ఈ సింగర్స్ కేవలం 5 లక్షల తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం మరి రాజమౌళి ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా టీంకు ఎలాంటి స్పెషల్ బోనస్ లు ఇస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news