టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బుల్లితెర రాములమ్మ గా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ..యాంకరింగ్ తో పాటుపలు సినిమాలలో హీరోలకు చెల్లెలుగా కీలకపాత్రలో కూడా నటిస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . తన ఫేం తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ..రన్నర్ గా నిలిచి బిగ్ బాస్ చరిత్రలోనే ఓ సంచలనాన్ని సృష్టించింది .
హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత శ్రీముఖి సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని .. తనకంటూ ప్రత్యేకమైన లైఫ్ ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ..ప్రెసెంట్ సినిమాల్లోనూ పలు కీలక పాత్రలో నటిస్తుంది . చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఇప్పటికే ఓ కీలక పాత్రకు సెలక్ట్ అయిన శ్రీముఖి… తాజాగా నందమూరి బాలయ్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ణ్భ్ఖ్ 108 సినిమాను లోను ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలోను శ్రీముఖి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాదు స్వయాన ఈ రోల్ విన్న తర్వాత బాలయ్యనే ఈ పాత్రకు శ్రీముఖి అయితే బాగుంటుంది అని ఆమెను అప్రోచ్ అవ్వమని అనిల్ కి సజిస్ట్ చేస్తారట. ఈ క్రమంలోనే బాలయ్య లాంటి స్టార్ హీరో నే శ్రీముఖి యాక్టివ్ నెస్ కి ఫిదా అయ్యాడు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. శ్రీముఖి ఎనర్జీ లెవల్ చూసే బాలయ్య ఈ ఆఫర్ ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇది నిజంగా శ్రీముఖి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. చూద్దాం దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?