MoviesBig Breaking : RRR ఆస్కార్ అవార్డు గెలిచిందోచ్.. ఇండియన్ సినిమా...

Big Breaking : RRR ఆస్కార్ అవార్డు గెలిచిందోచ్.. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన రాజమౌళి..!!

ఎస్ ఇది నిజంగా ప్రతి ఇండియన్ గర్వపడాల్సిన విషయం .. గత కొన్ని ఏళ్ళు గా ఆస్కార్ అవార్డు కొట్టాలి అని ఎదురు చూసిన ఇండియన్స్ కోరికను తీర్చాడు రాజమౌళి. కోట్లాది మంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన మూమెంట్ ఎట్టకేలకు వచ్చేసింది . రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వరించింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రాజమౌళి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. RRR చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే హాలీవుడ్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్.. కొద్దిసేపటి క్రితమే సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ని కూడా దక్కించుకుంది. ఆస్కార్ వేదికపై ఆస్కార్ అవార్డును అందుకున్నారు చంద్రబోస్ ..మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.

ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే . సుదీర్ఘంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసిన ఆర్ఆర్ఆర్ టీం ఫైనల్లీ ఆస్కార్ అవార్డును ముద్దాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు గోస్ట్ నాటు నాటు అని చెప్పగానే అక్కడున్న రాజమౌళి ..కీరవాణి.. రామ్ చరణ్ ..ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు. ఇది కేవలం ప్రతి ఇండియన్ సంబరపడే విజయం అంటూ కీరవాణి చెప్పుకోచ్చారు.

అంతేకాదు ఆస్కార్ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు . తెలుగు సినిమా ఆస్కార్ వరకు చేరుకోవడమే కాదు సుసాధ్యమైన పనిని సాధ్యం చేసే విధంగా కూడా చేయగలరు ..ఆస్కార్ అందుకోగలరు అంటూ ప్రూవ్ చేసింది . మరోసారి సోషల్ మీడియాలో రాజమౌళి పేరు వైరల్ అవుతుంది . తెలుగు సినిమా కి ఆస్కార్ తీసుకొచ్చిన రాజమౌళికి ..RRR టీం కి తెలుగు లైవ్స్ తరుపున హార్టీ కంగ్రాట్యులేషన్స్ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news