Moviesఅలాంటి కుక్కల నోర్లు రాజమౌళి మూయించాడుగా.. ఇప్పుడు ఏం మొరుగుతాయో..!?

అలాంటి కుక్కల నోర్లు రాజమౌళి మూయించాడుగా.. ఇప్పుడు ఏం మొరుగుతాయో..!?

ఎస్ ఫైనల్లీ.. కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది . రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ స్టేజ్ పై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలోనే చాలా ఎమోషనల్ అవుతూ కీరవాణి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆస్కార్ గెలిచిన దాఖలాలు లేవు . నామినేషన్స్ వరకు వెళ్లిన అక్కడ ఫ్లాప్ అయిపోయి.. వెనక్కి వచ్చాయి. ఫస్ట్ టైం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆర్ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకొని కనివిని ఎరుగని రికార్డును క్రియేట్ చేసి పెట్టింది. అది కూడా మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడం ప్రతి ఒక్క తెలుగువాడు సాధించిన విజయమనే చెప్పాలి . ఇలాంటి క్రమంలోని ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కి నామినేట్ అయింది అని తెలియగానే కొందరు సోషల్ మీడియాలో రాజమౌళి ట్రోల్ చేశారు .

ఆయనకు అంత సత్తా లేదని ..ఆయన డబ్బులు ఇచ్చే ఆస్కార్ అవార్డు కొనుకుంటున్నారని ..చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు ఆయనపై నోరు జారారు . ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ఫాన్స్ కూడా అలాంటి వాళ్ళకి ఘాటుగా జవాబు ఇచ్చారు. ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు మరోసారి అలాంటి నోరు తూలిన పెద్ద మనుషులకు ఘాటైన జవాబు ఇస్తున్నారు ఆర్ఆర్ఆర్ ఫాన్స్ .వాళ్ళను కుక్కలతో కంపేర్ చేస్తూ.. సరికొత్త సోషల్ హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు .

ఇన్నాళ్లు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రాదు అంటూ మొరిగిన కుక్కలు ఇప్పుడు ఏం మొరుగుతాయో..? డబ్బులు ఇచ్చే ఆస్కార్ కొనుక్కునే అంత స్థాయికి మనం దిగజారిపోలేదు రా ఫూల్స్..? అన్న విషయం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో..? ఏది ఏమైనా వాళ్లు ఇండియన్ సే కదా..? ఆస్కార్ సాధించినందుకు వాళ్లు సంబర పడాల్సిన సమయం ఇది.. అంటూ దారుణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే కొందరు పెద్ద మనుషులను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news