MoviesNTR30పై బిగ్ ట్విస్ట్‌… ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..!

NTR30పై బిగ్ ట్విస్ట్‌… ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..!

గ‌త వారం రోజులుగా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఎట్ట‌కేల‌కు ఓ గుడ్‌న్యూస్ వ‌చ్చేసింది. స్పాట్‌లైట్ అవార్డుల వేడుక‌కు రామ్‌చ‌ర‌ణ్‌ను ఆహ్వానించి ఎన్టీఆర్‌ను ఆహ్వానించ‌లేద‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. త‌మ హీరోను ఎందుకు ? దూరం పెడుతున్నారు అంటూ ఒక్క‌సారిగా వారంతా ఫైర్ అయ్యారు. ఓ వైపు ఈ అవార్డుల విష‌యంలో ముందు నుంచి రామ్‌చ‌ర‌ణ్ బాగా హైలెట్ అవుతూ వ‌చ్చాడు.

ఓ వైపు త్రిబుల్ ఆర్ సినిమా వ‌చ్చి యేడాది అవుతోంది. ఇంకా ఎన్టీఆర్ కొత్త సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు. కొర‌టాల శివ ఈ సినిమా విష‌యంలో నాన్చుతూ వ‌స్తున్నాడు. ఇలా చాలా నిరాశ‌తో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కాస్త కొత్తు ఉత్సాహం నింపేలా ఎన్టీఆర్ 30 సినిమా అప్‌డేట్ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీక‌పూర్ న‌టిస్తున్నార‌న్న టాక్ వ‌చ్చేసింది.

అయితే జాన్వీక‌పూర్ న‌టిస్తుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. జాన్వీ పుట్టిన రోజు అయిన మార్చి 6వ తేదీన ఈ సినిమాలో ఆమె న‌టిస్తుంద‌న్న అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేలా చేస్తున్నారు. అదే జ‌రిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ వ‌చ్చేసిన‌ట్టే..! ఇక ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల‌లోనే ప్రారంభించే ఛాన్సులు ఉన్నాయి.

యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై కొర‌టాల స‌న్నిహితుడు మిక్కిలినేని సుధాక‌ర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏక‌ధాటిగా జ‌రిపి వ‌చ్చే ఏప్రిల్లో రిలీజ్ చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో కొర‌టాల – ఎన్టీఆర్ కాంబోలో జ‌న‌తా గ్యారేజ్ లాంటి సూప‌ర్ హిట్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా జ‌న‌తా గ్యారేజ్‌ను మించిన హిట్ అవుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news