MoviesNTR 30: షూటింగ్ రోజునే సినిమా బ్యాక్‌డ్రాప్ లీక్ అయిపోయింది… గూస్‌బంప్స్...

NTR 30: షూటింగ్ రోజునే సినిమా బ్యాక్‌డ్రాప్ లీక్ అయిపోయింది… గూస్‌బంప్స్ మోతే…!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రారంభం అయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ సినిమా ఎనౌన్స్‌ చేసి నెలలు గడుస్తున్న ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.

పైగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడాది దాటిపోతుంది. ఓవైపు ఎన్టీఆర్ అభిమానులు కూడా బాగా నిరుత్సాహంతో ఉన్నారు. వీరి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈరోజు షూటింగ్ ప్రారంభం అయింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్‌, హీరోయిన్ జాన్వీకపూర్ ఈ సినిమా షూటింగ్ కు హాజరయ్యారు. అయితే తన సినిమా గురించి ఎప్పుడు చిన్న హింట్‌ కూడా లీక్ అయ్యేందుకు ఇష్ట‌ప‌డ‌ని కొరటాల… ఎన్టీఆర్ సినిమా స్టోరీ లైన్ ఎలా ? ఉండబోతుందో ముందే క్లారిటీ ఇచ్చేశారు.

అనగనగా ఒక సముద్ర తీర ప్రాంతం… అదంతా మనం మరిచిపోయిన భూభాగం… ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. భయం అంటే ఏమిటో ? తెలియని మృగాలు అవి.. వాళ్లకు దేవుడు అంటే భయం లేదు… చావు అంటే భయం లేదు.. కానీ ఒక్కటంటే భయం.. ఆ భయం ఎన్టీఆర్… ఇలా ఎన్టీఆర్ పాత్ర ఉద్దేశిస్తూ కొరటాల మాట్లాడారు. అంటే సినిమాలో మృగాల కంటే దారుణంగా మనుషులను భయపెట్టే వాళ్ల ? భరతం ఎలా ప‌ట్టాడు అన్న శక్తివంతమైన క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ను చూపించబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయింది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండడంతో పాన్ ఇండియా లెవెల్ లో కూడా అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. పైగా త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో మంచి హైప్‌ అయితే ఉంది. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news