Movies"చేతిలో గోరింటాకు..పెదాల పై చిరునవ్వు".. గుడ్ న్యూస్ చెప్పిన నాని హీరోయిన్..!!

“చేతిలో గోరింటాకు..పెదాల పై చిరునవ్వు”.. గుడ్ న్యూస్ చెప్పిన నాని హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కొందరు ఏజ్ అయిపోతుంది అని చేసుకుంటే మరికొందరు ఫ్యామిలీలోని పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు . ఫైనల్లి వాళ్లు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకొని అభిమానులకి కొత్త బూస్ట్ప్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు.

కాకపోతే రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోతుంది నివేద థామస్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఫైనల్లీ ఎట్టకేలకు తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది అందాల ముద్దుగుమ్మ నాని హీరోయిన్ నివేదా థామస్. రీసెంట్గా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచుట్టించిన నివేదాతో పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవడంతో సింపుల్గా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేధా థామస్ రీసెంట్గా అభిమానులతో ముచ్చటించింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నివేదా థామస్ చేతికి గోరింటాకు ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. పెదాలపై క్యూట్ స్మైల్ తో ..”ఏముంది అండి.. ఆలోచన..ఆ ఉద్దేశం ఏమీ లేవు.. ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను “అంటూ సింపుల్గా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటూ చెప్పేసింది. అంతేకాదు గత కొన్ని నెలలుగా ఎవరితోనో ఎఫైర్ లో ఉంది ..ఎవరితోనో లవ్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . వాటికి చెప్పకనే చెక్ పెట్టేసింది నివేదా . తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటూ అభిమానులకి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది . ఈ క్రమంలోనే నివేద థామస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news