Moviesనాని ద‌స‌రా ట్రైల‌ర్ అరాచ‌కం.. బొమ్మ‌కు ముందే బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ (వీడియో)

నాని ద‌స‌రా ట్రైల‌ర్ అరాచ‌కం.. బొమ్మ‌కు ముందే బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ (వీడియో)

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ సినిమా ద‌స‌రా. నాని గ‌త కొంత కాలంగా న‌టిస్తోన్న సినిమాల‌కు మంచి టాక్ వ‌స్తున్నా.. అవి క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. దీంతో ద‌స‌రా మూవీతో మాస్ హీరోగా తిరుగులేని హిట్ కొడ‌తాన‌ని కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించాడు.

ఇక సంతోష్ నారాయణన్ దీనికి మ్యూజిక్ అందించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్స్ అన్నీ సినిమాపై అంచ‌నాలు అయితే పెంచేశాయి. ఇక ఈ రోజు ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఏకంగా ల‌క్నోలో రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ లో నాని నేచుర‌ల్ పెర్సామెన్స్‌తో పాటు డైలాగులు, మాస్ స్టైల్ అదిరిపోయింది.

హీరోయిన్ కీర్తి సురేష్ చాలా డిఫ‌రెంట్ లుక్‌లో ఆక‌ట్టుకుంది. సంగీత ద‌ర్శ‌కుడు సంతోష్ నారాయ‌ణ‌న్ అందించిన బీజీఎంతో పాటు యాక్ష‌న్ సీన్స్‌, ఫొటోగ్ర‌ఫీ ఇలా ఒక్క‌టేంటి… అన్నీ బాగున్నాయి. ఏదేమైనా ద‌స‌రా ట్రైల‌ర్‌తో నాని యూత్‌తో పాటు మాస్‌ను టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మార్చి 30న పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news