Moviesటాలీవుడ్‌లోనే ఫర్ ది ఫస్ట్ టైమ్‌..రవితేజ-నాని సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం..!!

టాలీవుడ్‌లోనే ఫర్ ది ఫస్ట్ టైమ్‌..రవితేజ-నాని సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫర్ ద ఫస్ట్ టైం కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టారు నాచురల్ స్టార్ హీరో నాని . అలాగే మాస్ హీరో రవితేజ . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా నటిస్తున్న సినిమా దసరా . శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో జోరు పెంచారు హీరో నాని .

లక్నో, వైజాగ్ ..ఇతర ప్రధాన నగరాలలో ఆయన సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ నెల 24 లేదా 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది . అయితే వార రోజుల గ్యాప్ తోనే మరో స్టార్ హీరో సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. రవితేజ హీరోగా నటించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 7న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఇందులో సుశాంత్ కీలకపాత్ర పోషిస్తుండగా.. అను ఇమ్మానుయేల్.. మెగా ఆకాష్.. దక్ష, పూజిత పొన్నాడా , ఫరియా ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు .

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను స్టార్ట్ చేసింది రావణాసుర టీం. రీసెంట్ గానే రిలీజ్ అయిన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది . ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు . వేరువేరుగా సినిమా ప్రమోషన్స్ చేయడం కన్నా.. ఇద్దరు కలిసి సినిమాని ప్రమోట్ చేసుకోవడం కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడుతుంది అంటూ డిసైడ్ అయ్యి ..నాని రవితేజ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ని కండక్ట్ చేసుకున్నారు .

దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది . రేపో మాపో ఈ వీడియో ప్రోమోని రిలీజ్ చేయనున్నారు మేకర్స్ అంటూ తెలుస్తుంది . ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్వయంగా ప్రమోట్ చేసుకోవడం ఇండస్ట్రిలో ఫస్ట్ టైం గా మారబోతుంది. త్వరలోనే నాని – రవితేజ ల వీడియో విడుదల కాబోతున్నట్టు సమాచారం అందతుంది . ఈ క్రమంలోనే టాలీవుడ్ సర్కిల్లో ఈ న్యూస్ తెగచక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే ఇదొక ట్రెండ్ సెట్టర్ అవుతుందనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news