Moviesవ‌రుణ్‌తేజ్ - లావ‌ణ్య పెళ్లి ఈ గొడ‌వ‌ల‌తోనే ఆగిందా... నాగ‌బాబు భార్య...

వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య పెళ్లి ఈ గొడ‌వ‌ల‌తోనే ఆగిందా… నాగ‌బాబు భార్య పంతం…!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత రెండు సంవత్సరాలుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో డీప్ లవ్లోకి వెళ్లిపోయారు. ఎన్నోసార్లు లావణ్య, వరుణ్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూనే వస్తోంది.
రెండేళ్ల క్రితం లావణ్య పుట్టినరోజు సందర్భంగా వరుణ్ కోటి రూపాయల డైమండ్ రింగ్‌తో బెంగళూరు వెళ్లి మరి ఆమెకు ప్రపోజ్ చేస్తున్నాడు అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి.

వరుణ్ తేజ్ కు ఇప్పటికే పెళ్లి వయసు వచ్చేసింది. నాగబాబు కూడా త్వరగా పెళ్లి చేయాలని కంగారుపడుతున్న మాట వాస్తవం. అయితే పెళ్లి మాత్రం జరగటం లేదు. లావణ్య ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులకు బాగా సన్నిహితం అయింది. రాజస్థాన్లో జరిగిన నిహారిక పెళ్లిలో కూడా అన్ని తానై వ్యవహరించింది. అసలు రాజస్థాన్లో జరిగిన నిహారిక పెళ్లికి.. మెగా ఫ్యామిలీతో పాటు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. విచిత్రం ఏంటంటే అక్కడ కూడా లావ‌ణ్య‌ హడావుడి చేసింది.

నిహారికను పెళ్లి కుమార్తెను చేయ‌డం దగ్గర నుంచి అన్ని తానే చూసుకుంది. ఆమెకు ఎందుకు ? అంత ప్రయారిటి ఇస్తున్నారు అన్న సందేహాలు అప్పుడే వచ్చాయి. ఆమె నాగబాబు ఇంట్లో అడుగుపెట్టే కోడలు అని అప్పుడే చాలామందికి క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని.. ఇప్పటికే వీరి మధ్య దూరం పెరిగిందని ఒక్కటే గుసగుసలు నడుస్తున్నాయి. ఈ టెన్షన్ లో ఉన్న నాగబాబు కుటుంబం వరుణ్ తేజ్ పెళ్లిని వాయిదా వేసింద‌ని అంటున్నారు. గత ఐదారు రోజులుగా నిహారిక – చైతన్య విడిపోతున్నారంటూ ఒక్కటే వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎవరు క్లారిటీ ఇవ్వటం లేదు.

పైగా సోషల్ మీడియా అకౌంట్లో ఒకరిని ఒకరు ఫాలో కావటం లేదని కూడా అంటున్నారు. నిహారిక, చైతన్య గొడవలతోనే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఆగిందని.. దానిపై క్లారిటీ వచ్చేవరకు వరుణ్ తేజ్, లావణ్య మధ్య కొద్దిరోజులపాటు ఎడబాటు తప్పదని అంటున్నారు. నాగబాబు ఆ టెన్షన్లో ఉండి వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆలోచన చేయటం లేదని కూడా తెలుస్తోంది. అయితే నాగబాబు భార్య పద్మజకు లావణ్య తన ఇంటి కోడలుగా రావడం ఇష్టమే అని.. ఆమె మాత్రం కొడుకుకు త్వరగా పెళ్లి చేసేయాలని కంగారు పడుతుందని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా నిహారిక, చైతన్య విష‌యం క్లారిటీ వచ్చేవరకు వరుణ్ తేజ్ – లావ‌ణ్య‌ పెళ్లి జరిగేలా కనిపించడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news