Moviesపెళ్లి వేడుక‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మ‌హేష్ - న‌మ్ర‌త‌… పెళ్లి కొడుకు...

పెళ్లి వేడుక‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మ‌హేష్ – న‌మ్ర‌త‌… పెళ్లి కొడుకు ఎవ‌రు అంటే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో గత ఏడాది వరుసగా విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్ది నెలల కాలంలోనే తల్లి ఇందిరాదేవితో పాటు.. తండ్రి సూపర్ స్టార్ కృష్ణను కోల్పోయారు. దీంతో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను హీరోగా తెర‌కెక్కాల్సిన మహేష్ కొత్త‌ సినిమా కూడా ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్ళింది.

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న మహేష్ 20 రోజుల వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత తన సినిమా షూటింగ్ కోసం రెడీ అయ్యాడు. ఇక ఇప్పుడు బయట ఫంక్షన్లకు కూడా వస్తున్నాడు. తాజాగా మహేష్ – నమ్రత కలిసి హైదరాబాద్‌లో ఒక వివాహ వేడుకలో కనిపించారు. అసలు వీరిద్దరూ కలిసి పక్కపక్కన ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు.

మహేష్ వైట్ చొక్కా – బ్లూ జీన్ వేసుకుని నిజంగా రాకుమారుడులా కనిపిస్తున్నాడు. పక్కనే నమ్రత రెడ్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని మహేష్ పక్కన చాలా పర్ఫెక్ట్ జోడీలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. వీరిద్దరూ పెళ్ళికొడుకు, పెళ్లికూతురిని ఆశీర్వదించేటప్పుడు ఇచ్చిన స్మైల్ మాత్రం అదిరిపోయింది. నమ్రత అయితే మహేష్ పక్కన చిరునవ్వులు చిందిస్తూ వధూవరులను అక్షింతలతో ఆశీర్వదిస్తున్న సీన్ అద్భుతంగా ఉందని చెప్పాలి.

వీరి జోడితో పాటు.. వీరిద్ద‌రి చిరునవ్వు చూడ ముచ్చట గొలిపేలా ఉంది. హైదరాబాదులో ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్రెండ్ తనయుడి వివాహ వేడుకకు వీరిద్దరూ వచ్చారు. ఇప్పుడు ఈ పెళ్లిలో మహేష్ – నమ్రత ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news