Moviesజక్కన్న జాతకం ఇంత దారుణంగా ఉందా.. రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?

జక్కన్న జాతకం ఇంత దారుణంగా ఉందా.. రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించినా ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించడం జరిగింది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. గత కొన్నేళ్లలో రాజమౌళి ఫ్యామిలీ కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది.

మహేష్ తో జక్కన్న తెరకెక్కించే సినిమా సైతం రికార్డులను తిరగరాస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే జక్కన్న జాతకం మరో విధంగా ఉండబోతుందని ప్రముఖ జ్యోతిష్కులు చెబుతున్నారు. అతి త్వరలో జక్కన్న రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఒక జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ జ్యోతిష్కుని మాటలు విని రాజమౌళి ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

ఆ జ్యోతిష్కుడు మాట్లాడుతూ దర్శకధీరుడు రాజమౌళి అతి త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తారని అన్నారు. రాజమౌళి జ్ఞానానికి సంబంధించి ఒక సినిమా చేస్తారని ఆ సినిమా దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఏడేళ్ల పాటు రాజమౌళి ఒక సినిమాను చేసి ఆ తర్వాత రిటైర్మెంట్ ను ప్రకటించడం జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే సీనియర్ ఎన్టీఆర్ ను చూస్తున్న భావన కలుగుతుందని జ్యోతిష్కుడు పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలం తర్వాత రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని జ్యోతిష్కుడు కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళితే సీరియస్ గా రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తారని ఆయన వెల్లడించారు. చరణ్ జాతకం బాగుందని ఆయన తెలిపారు. ఈ జ్యోతిష్కుని మాటలు నిజమవుతాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

రాజమౌళి ఫ్యాన్స్ సైతం వయస్సు పెరిగినా జక్కన్న డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. చరణ్, ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news