Moviesపెళ్లి కూతురుగా ముస్తాబైన జ‌య‌ల‌లిత‌… మూడు ముళ్లకు సిద్ధ‌మైన శోభ‌న్‌బాబు.. షాకింగ్...

పెళ్లి కూతురుగా ముస్తాబైన జ‌య‌ల‌లిత‌… మూడు ముళ్లకు సిద్ధ‌మైన శోభ‌న్‌బాబు.. షాకింగ్ క్లైమాక్స్‌..!

పెళ్లి కూతురుగా ముస్తాబైన జ‌య‌ల‌లిత‌… మూడు ముళ్లకు సిద్ధ‌మైన శోభ‌న్‌బాబు.. షాకింగ్ క్లైమాక్స్‌..!
అప్పట్లో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, టాలీవుడ్ దివంగత హీరో శోభన్ బాబు ప్రేమాయణం గురించి తెలియని వారు లేరు. జయలలిత – శోభన్ బాబు ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. వీరిది పవిత్ర ప్రేమ. అప్పటికే శోభన్ బాబుకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. శోభన్ బాబు తన గురువుగారి కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యారు. ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న జయలలిత.. శోభన్ బాబును ఎంతో ఇష్టపడింది.

శోభన్ బాబు లేకుండా ఆమె ఒక్క‌ క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. జయలలిత అంటే శోభన్ బాబుకి కూడా ఇష్టమే. ఆమెను ఎంతో ప్రేమించేవారు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఒకానొక దశలో జయలలిత – శోభన్ బాబును బెదిరించి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అనడంతో.. చివరకు శోభన్ బాబు అయిష్టంగానే ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

జయలలిత తన ఇంట్లో పెళ్లికూతురు గెటప్‌లో ముస్తాబయ్యి ఉంది. ఆమె పెళ్లి కోసం నగలు, వడ్డానం అన్ని సిద్ధం చేసుకుని శోభన్ బాబుతో మూడు ముళ్ళు వేయించుకునేందుకు రమ్మని చెప్పింది. శోభన్ బాబు కూడా తన ఇంటి దగ్గర బయలుదేరి జెమినీ స్టూడియో వరకు వచ్చారు. అయితే ఆయనకు తన భార్య ఉండగానే జయలలితను పెళ్లి చేసుకునేందుకు మనసు ఎందుకో ? ఒప్పుకోలేదు. ఆమెకు ద్రోహం చేసేందుకు ఇష్టపడలేదు. వెంటనే జయలలిత ఇంటికి ఫోన్ చేసి తాను పెళ్ళికి రాలేను క్షమించాలని కోరాడు.

చాలా రోజుల తర్వాత ఈ విషయం కుట్టి పద్మిని ద్వారా బయటికి వచ్చింది. అప్పట్లో కుట్టి పద్మిని, జయలలిత బాగా స్నేహంగా ఉండేవారు. పద్మిని, జయలలిత ఇంటిపక్కనే ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహితులు. అయితే శోభన్ బాబు ఇలా నమ్మించి మోసం చేయడం జ‌య‌ల‌లిత‌కు నచ్చలేదని.. ఆ తర్వాత ఆమె చాలా కృంగిపోయారని కుట్టి పద్మిని తెలిపింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఉత్సాహంగా కెరియర్లో ముందుకు సాగారని కుట్టి పద్మిని చెప్పింది. అయితే కుట్టి పద్మిని ఈ స్టోరీ అంతా చెప్పినా ఎక్కడ శోభన్ బాబు పేరు మాత్రం వాడలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news