Moviesఅఖిల్ జాతకం ఇంత ఘోరమా.. మ‌నోడి చేయి ప‌డితే చాలు ఆ...

అఖిల్ జాతకం ఇంత ఘోరమా.. మ‌నోడి చేయి ప‌డితే చాలు ఆ హీరోయిన్ నాశ‌న‌మే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అఖిల్ ఒకరు కాగా “అఖిల్” సినిమాతో అఖిల్ సినీ కెరీర్ మొదలైంది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సయాషా సైగల్ నటించిగా అఖిల్ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి తెలుగులో ఎక్కువగా సినీ ఆఫర్లు రాలేదు. ఆ త‌ర్వాత స‌యేషా కోలీవుడ్‌లోకి వెళ్లి త‌న‌కంటే వ‌య‌స్సులో చాలా పెద్దోడు అయిన ఆర్య‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

అఖిల్ రెండో సినిమా హలో మూవీలో అఖిల్ కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా ఈ సినిమా కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడం ఈ హీరోయిన్ పాలిట శాపమైంది. క‌ళ్యాణికి కావాల్సినంత అందం ఉన్నా కూడా తెలుగులోనే కాదు.. ఆమె సొంత భాష‌లోనూ ఆమెను ప‌ట్టించుకోలేదు. అఖిల్ మూడో సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కగా మిస్టర్ మజ్ను పేరుతో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమె కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో హరిహర వీరమల్లు తప్ప మరో సినిమా లేదు. ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అఖిల్ నాలుగో మూవీ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా హిట్టైనా ఈ సినిమా తర్వాత పూజా హెగ్డేకు వరుస షాకులు తగులుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమె ఓ ఐరెన్ లెగ్ హీరోయిన్ అన్న ముద్ర ప‌డిపోయింది. ఇటీవ‌ల కాలంలో ఆమె న‌టించిన అన్ని సినిమాలు ప్లాపులే అవుతున్నాయి. అఖిల్ కు జోడీగా నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ నాశనమవుతోందని ఇండస్ట్రీలో కొత్త సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. ఈ నెగిటివ్ సెంటిమెంట్ గురించి అఖిల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

అఖిల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతున్నా స్టార్ స్టేటస్ దక్కడం లేదు. అఖిల్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏజెంట్ లో హీరోయిన్ గా నటిస్తున్న సాక్షి వైద్య అయినా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news