Moviesమగధీరకి మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా..? చేతులారా ఆఫర్...

మగధీరకి మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా..? చేతులారా ఆఫర్ ని వదులుకున్న హీరో ఇతనే..!!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో నే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆర్ఆర్ఆర్. మరికొద్ది రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును చేతుల్లో పెట్టుకో బోతుంది . ఈ క్రమంలోని ఆ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోని రాజమౌళి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మగధీర సినిమాను రిజెక్ట్ చేసిన హీరో విషయం బయటపడ్డింది.

నకు తెలిసిందే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ చరణ్..చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు. ఆ తర్వాత రెండో సినిమాతోనే ఎస్ఎస్ రాజమౌళి లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అవకాశం అందుకున్నాడు . అంతేనా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలా అంటే తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసింది . ఈ సినిమాలో చరణ్ పోషించిన పాత్రలు రెండు అభిమానులను ఆకట్టుకున్నాయి . హర్ష పాత్రలో జాలీగా గడిపే కుర్రాడిగా.. కాలభైరవ పాత్రలో రాజ్యాన్ని గౌరవించే సైనిక భటుడిగా.. లీనమైపోయినటించాడు .

ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన కాజల్ అగర్వాల్ కెరియర్ ఈ సినిమా తర్వాత ఎలా మలుపు తిరిగిందో మనందరికీ తెలిసిందే . కాగా మొదట ఈ సినిమాలో హీరోగా అనుకున్నింది టాలీవుడ్ స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే తెరకెక్కింది, ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి హీరో ఈ సినిమాలో నటిస్తే సూపర్ అంటూ అప్పట్లో అల్లు అరవింద్ భావించారట .

అయితే రాజమౌళి ఈ కథకు బన్నీ సూట్ అవ్వడని సున్నితంగా ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ ఆఫర్ రామ్ చరణ్ వద్దకు వెళ్లడం,, చిరంజీవి స్క్రిప్ట్ చదివి ఓకే చేయడం చకచగా జరిగిపోయాయి . ఫైనల్లీ సినిమాను తెరకెక్కించి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది . ప్రజెంట్ బన్నీ పుష్ప 2 సినిమాలో బిజీ గా ఉంటే..చరణ్, రాజమౌళీ.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అమెరికాలో బిజీగా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news