Moviesఎన్టీఆర్ లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేని ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?...

ఎన్టీఆర్ లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేని ఆ ఇద్దరు ఎవరో తెలుసా..? టోటల్ జీవితానే మార్చేసారుగా..!!

నందమూరి నటవారసుడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నాడు మనందరికీ బాగా తెలిసిందే. గ్లోబల్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . రీసెంట్గా ఆయన నటించిన ఆరారార్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది. అవార్డు ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన తారక్ కి ఘన స్వాగతం లభించింది. మరి ముఖ్యంగా ఓ టైగర్ జూ నుండి బయటకు వచ్చి జనాల మధ్య తిరిగితే ఎలా ఉంటుందో అలాంటి ఓ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం సోషల్ మీడియాలో చూస్తూనే వచ్చాము .

హాలీవుడ్ స్టార్ సైతం ఎన్టీఆర్ లుక్స్ కి.. పద్ధతికి ..మర్యాదలకు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిజానికి 2014 వరకు ఎన్టీఆర్ తన లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే వచ్చారు. చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ గా మారాయి . అయితే 2014 తర్వాత ఎన్టీఆర్ లైఫ్ కు మహర్దశ పట్టింది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు తీసిన ప్రతి సినిమా హిట్ అయింది.

5 మే 2011 లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి.. జూలై 22 , 2014న అభయ్ రామ్ జన్మించారు.. అప్పటినుంచి ఆయన కెరియర్ మారిపోయింది. మంచి మంచి స్టోరీస్ పడుతూ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక 2018 జూన్ 14న మరో బిడ్డ భార్గవ్ రామ్ జన్మించాడు . ఈ క్రమంలోనే ఏకంగా ఆయన లెవల్ మారిపోయి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఒకప్పుడు చిన్న హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారి హాలీవుడ్ ప్రముఖులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ..అంటే అది కచ్చితంగా ఆయన పడిన కష్టానికి ఫలితం అనే చెప్పాలి . ఈ విధంగా ఎన్టీఆర్ లైఫ్ నీ టోటల్గా టర్న్ చేసేసారు భార్గవ్ రామ్ – అభయ్ రామ్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news