Moviesit's Official: పెళ్లి డేట్ ప్రకటించిన బిగ్ బాస్ ప్రియాంక.. అబ్బాయి...

it’s Official: పెళ్లి డేట్ ప్రకటించిన బిగ్ బాస్ ప్రియాంక.. అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తలా తోక లేని వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాము . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పెళ్లి న్యూస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కాగా రీసెంట్గా మరోసారి అలాంటి ఓ ఫేక్ న్యూస్ పై ఫన్నీగా స్పందించింది బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక ..అదే పింకీ . ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. పింకీగా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పింకీ అందాలు అందర్నీ ఆకట్టుకున్నాయి . ఆమె పర్సనల్ ఫ్యామిలీ విషయాలను కూడా ఓపెన్ గా చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది .

రీసెంట్ గా పింకి పెళ్లి అంటూ పలు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఈ క్రమంలోనే ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాంటి వాళ్లకి బుద్ధి చెప్పాలి అనుకుని.. అఫీషియల్ గా తన పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసింది . గతంలో ప్రియాంక మెహందీ , పసుపు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రియాంక పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. కాగా దీనిపై తన యూట్యూబ్ ఛానల్ లో అఫీషియల్ గా స్పందించింది పింకీ .

ఆమె మాట్లాడుతూ ..”అవును నేను పెళ్లి చేసుకోబోతున్నాను .. పేరెంట్స్ ఒప్పుకున్నాక అంత సెట్ అయ్యాక చెబుదామని ఆగాను.. ఇంకా చెప్పాలంటే కొంచెం సిగ్గేస్తుంది ..నా పెళ్లి ఎప్పుడు..? నాకు కాబోయే భర్త ఎవరు ..? ఎలా ఉంటారు..? అన్ని ఈ వీడియోలో తెలుస్తాయి అంటూ చివరి వరకు మాటలతో గడిపేసిన ప్రియాంక.. లాస్ట్ లో జస్ట్ ఫ్రాంక్ అంటూ మైండ్ బ్లాక్ చేసింది . అంతేకాదు ఫన్నీగా 2024 ఫిబ్రవరి 30న పెళ్లి జరగబోతుంది అంటూ కూడా వీడియోలో ప్రకటించడం అభిమానులకి షాకింగ్ గా అనిపించింది.

నిజంగానే ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందా..? అంటూ షాక్ అయిపోయారు జనాలు. ఫైనల్లీ ఇదంతా ఫ్రాంక్ అని తెలియడంతో డిసప్పాయింట్ అయ్యారు. అంతేకాదు కుందనపు బొమ్మ లాంటి పింకీ ని పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవడో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో మొదట్లో ఆమె చెప్పిన మాటలు విని.. నిజంగానే పింకీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలామంది కంగ్రాట్స్ కూడా చెప్పేశారు . కాగా ఇలాంటి ప్రాంక్ వీడియోలు యూట్యూబ్ లో ఇదేమి కొత్త కాదు.. గతంలో జబర్దస్త్ వర్షా కూడా ఇలాగే ఎన్నో ప్రాంక్ వీడియోలు చేసి జనాలు చేత బూతులు తిట్టించుకుంది . వ్యూయ్స్ కోసం బుల్లితెర సెలబ్రిటీలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news