Moviesమంచు విష్ణు వెరోనిక ఎక్కడ ? ప్రేమలో పడ్డారో తెలుసా… ఇదో...

మంచు విష్ణు వెరోనిక ఎక్కడ ? ప్రేమలో పడ్డారో తెలుసా… ఇదో షాకింగ్..!

మా అధ్యక్షుడు మంచు విష్ణు టాలీవుడ్ లో బలమైన మంచు మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడో 2003లో వచ్చిన విష్ణు సినిమాతో హీరో అయిన విష్ణు హీరోగా అనుకొన్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే అటు నిర్మాతగాను.. ఓవర్సీస్ లో పంపిణీరంగంలోనూ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఇక విష్ణుకు సొంత వ్యాపారం ఉంది. తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటు అటు తన భార్య వైపు నుంచి వచ్చిన వ్యాపారాలు కూడా చాలానే ఉన్నాయి.

విష్ణు వ్యాపార రంగంలో బాగా సక్సెస్ అవుతున్నాడు. ఇక విష్ణుభార్య వెరోనికా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. వెరొనికా రెడ్డిది బలమైన కుటుంబం. ఇటు వైఎస్ కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే అటు ప్రముఖ నిర్మాత సిసి రెడ్డి పెద్ద మనవరాలు. ఆమె పుట్టింది పెరిగింది అంతా అమెరికాలోనే.

ఒకసారి ఇండియాకు వచ్చిన ఆమె తన తాత పుట్టినరోజు కోసం హైదరాబాద్ వెళ్లారట. అయితే అదే రోజు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు కూడా సిసి రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వెళ్లారట.. అలా తొలిచూపులోనే ఆమెను చూసి విష్ణు మెస్మరైజ్ అయిపోయాడు. ఆ మరుసటి రోజే ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి… ఈ రోజు నా పుట్టిన రోజు.. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నువ్వు కూడా రావాలని రిక్వెస్ట్ చేశాడట. విచిత్రం ఏంటంటే వేరోనికా విష్ణు వాళ్ల ఇంటికి వెళితే అక్కడ ఆమె తప్ప ఎవరూ లేరట.

ఆరోజు అసలు విష్ణు పుట్టినరోజు కూడా కాదు.. కేవలం తన ఇంటికి రప్పించుకునేందుకే విష్ణు అలా అబద్దం ఆడి పుట్టినరోజు అని ప్లాన్ చేశాడట. ముందు వెరొనిక కాస్త ఫీలైన ఆ తర్వాత విష్ణుతో స్నేహం చేయడం ప్రారంభించింది. అలా ప్రేమలో పడిన తర్వాత వీరి పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఇండస్ట్రీలో పెద్దలు సర్ది చెప్పడంతో మోహన్ బాబు ముందు అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక త‌మ‌ సంసార జీవితంలో విష్ణు, వెరోనికా చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్ బాబు కూడా విష్ణు కొడుకులు.. కూతుళ్ళతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news