Moviesఆస్కార్‌ తరువాత రాజమౌళి రేంజే మారిపోయిందిగా.. మహేష్‌ సినిమా కోసం కని...

ఆస్కార్‌ తరువాత రాజమౌళి రేంజే మారిపోయిందిగా.. మహేష్‌ సినిమా కోసం కని విని ఎరుగని రెమ్యూనరేషన్..!?

వామ్మో ..ఏంటి రాజమౌళి పాన్ ఇండియా హీరోలనే మించిపోయాడు. ఒక్కొక్క సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడా..? మామూలు ముదురు కాదుగా.. ఎస్ ప్రసెంట్ ఇలాంటి కామెంట్స్ తో రాజమౌళి పేరుని ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు . మనకు తెలిసిందే ప్రజెంట్ దర్శకధీరుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మారం మ్రోగి పోతుందో. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలోని కనీ విని ఎరుగని సంచలన రికార్డును క్రియేట్ చేశాడు రాజమౌళి.

ఇండియన్ ఫిలిం చరిత్రలోనే ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసాడు. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు రాజమౌళి . ఎంతో కష్టపడి ఇష్టంగా తాను అనుకున్న కథను కరెక్ట్లైజేషన్ చేస్తూ ఇద్దరు బడా హీరోలను పెట్టి సినిమా తెర కెక్కించాడు. కాగా 95 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ లిస్టులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటునాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

దీనితో రెండు రోజులుగా సోషల్ మీడియాలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ లెవెల్ లో రాజమౌళి పేరుకి క్రేజ్ దక్కింది. ఇలాంటి క్రమంలోనే టైం చూసి కొట్టాడు రాజమౌళి. మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాకు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాకి మహేష్ బాబు నే 70 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారట . అయితే ఎవరు ఊహించిన విధంగా ఓ డైరెక్టర్ ఇలా చేయడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.

జనరల్ గా ఇంత పెద్ద అమౌంట్ హాలీవుడ్ డైరెక్టర్లే అడుగుతూ ఉంటారు . ఇప్పటివరకు మన ఇండియన్ హిస్టరీలో ఏ డైరెక్టర్ 100 కోట్లు తీసుకోలేదు . ఫస్ట్ టైం రాజమౌళి ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఈ రికార్డును మరి ఎవరు బ్రేక్ చేయలేదని చెప్పాలి . చూడాలి మరి దీనిపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో ..నిజంగానే వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారా..? లేక ఇది కేవలం గాసిప్ నా..? అన్నది తెలియాలంటే రాజమౌళి కానీ ఆయన టీం కానీ స్పందిస్తే బాగుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news