MoviesBalayya బాలయ్య ఆయనని గుడ్డిగా నమ్మేస్తున్నాడా..? అందుకే ముంచేస్తున్నాడా..?

Balayya బాలయ్య ఆయనని గుడ్డిగా నమ్మేస్తున్నాడా..? అందుకే ముంచేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నందమూరి బాలయ్య కున్న క్రేజ్.. రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ ..మిగతా హీరోలకు దేనికి పనికిరాదనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హీరోలలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు బాలయ్య. ఈ విషయం అందరికీ తెలిసిందే కోపం వస్తే తిట్టేయడం..ప్రేమ వస్తే హత్తుకోవడం బాలయ్యకు పుట్టుకతో వచ్చిన విద్య . ఆఫ్ కోర్స్ తండ్రి పోలికలు ఎక్కడికి పోతాయి . నాన్న నందమూరి తారక రామారావు గారి పోలికలను అలవాట్లను తూ చా తప్పకుండా పాటిస్తూ .. బాలయ్య ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు .

కాగా బాలయ్య తర్వాత ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి నందమూరి మోక్షజ్ఞ ని దింపాలని నందమూరి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. బాలయ్య కూడా తన కొడుకు హీరో అవ్వడం కోసం చాలా ట్రై చేస్తున్నాడు . పెద్ద డైరెక్టర్స్ కూడా బాలయ్య కొడుకుతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచి మంచి కథలను తీసుకొస్తూ .. బాలయ్యకు వినిపిస్తూ .. మోక్షజ్ఞ ఎంట్రీ కి పక్క ప్లానింగ్ చేస్తున్నారు . అయితే బాలయ్య ఎక్కువగా నమ్మే జ్యోతిష్కుడు మాత్రం 2024 తర్వాతనే మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి దింపండి అంటూ చెప్తున్నారట .

ఆలోపు అతగాడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన అతడి కెరియర్ డిజాస్టర్ గా మారుతుందని .. ఆ తర్వాత మోక్షజ్ఞ జాతకం బాగుంది అని చెప్పుకొస్తున్నారట. ఈ క్రమంలోనే బాలయ్య కొడుకు ఎంట్రీ విషయంలో తర్జనభర్జన పడుతున్నాడు అంటూ తెలుస్తుంది . అయితే కొందరు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య ఆ జ్యోతిష్య్కుడు గుడ్డిగా నమ్మేస్తున్నాడు అంటూ చెబుతున్నారు . మోక్షజ్ఞ ఎంట్రీ త్వరగా ఇస్తే నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతారని మోక్షజ్ఞను స్టార్ హీరోగా చేసే బాధ్యత మాది అంటూ చెప్పుకొస్తున్నారు . దీనితో నందమూరి బాలయ్య ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియని అయో మయంలో ఉండిపోయాడు . చూద్దాం మరి బాలయ్య ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news