MoviesBunny-Charan చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్.. బన్ని ప్లేస్ లో చరణ్.....

Bunny-Charan చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్.. బన్ని ప్లేస్ లో చరణ్.. కొంప ముంచేసిన క్రేజీ డైరెక్టర్.. !?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న సినిమా చేతులు మారిందా ..? అంటే అవునని అంటున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు . స్టార్ట్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమా జవాన్. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ నయనతార .. హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా అయిపోగానే తెలుగు స్టార్ హీరో బన్నీతో సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యారట అట్లీ.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన టోటల్ కథను బన్నీకి వివరించారని.. ఈ క్రమంలోనే బన్నీ కూడా యాక్సెప్ట్ చేశారని.. ఓ న్యూస్ వైరల్ అయింది . అయితే పుష్ప 2 సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే .. ఈ సినిమాను తెరకెక్కించే విధంగా బన్నీ ప్లాన్ చేశారట . సుకుమార్ పుష్ప2 సినిమాను మరింత లేట్ చేయడంతో అట్లీ అంతవరకు ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టలేక ..మరో హీరోని కూడా సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది .

అంతేకాదు బన్నీ చేయాలనుకున్న పాత్రకి చరణ్ అయితే పక్కాగా సెట్ అవుతాడు అంటూ చరణ్ కోసం సంప్రదిస్తున్నారట . అంతేకాదు ప్రజెంట్ ఇప్పుడు చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో తెలిసిందే. ఇలాంటి మూమెంట్లో చరణ్ అట్లీ కాంబో తెరకెక్కితే మాత్రం అది కచ్చితంగా హాలీవుడ్ ను బ్రేక్ చేసే రికార్డు అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . దీంతో బన్నీ ఆఫర్ చరణ్ ఖాతలో పడిన్నట్లైంది, ఈ క్రమంలోనే మెగా – అల్లు ఫాన్స్ మధ్య మరోసారి మాటల హద్దులు దాటుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news