MoviesArudra Wife Ramalakshmi ఆరుద్ర భార్య రామ‌ల‌క్ష్మి మృతి… ఇంత గొప్ప...

Arudra Wife Ramalakshmi ఆరుద్ర భార్య రామ‌ల‌క్ష్మి మృతి… ఇంత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఉందా..!

తెలుగు సాహిత్య లోకం నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి వీడ్కోలు తీసుకున్నారు. ప్రముఖ రచయిత్రి ఆరుద్ర స‌తీమణి అయిన కే రామలక్ష్మి (92) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె హైదరాబాదులోని తన నివాసంలో మృతి చెందారు. మద్రాసు నగరంలో తెలుగు వారి ప్రతినిధిగా నాటి సాహితీ సమూహాలలో కీలకమైన వ్యక్తిగా… సినిమా రచయిత్రిగా ఆమె సుదీర్ఘమైన యాత్ర కొనసాగించారు. ఆమె మరణంతో ఒక కాలపు తెలుగు సాహితీ చరిత్రలో అద్భుతమైన వ్యక్తి లేకుండా పోయినట్టు అయింది. ఆమె జర్నలిస్టుగాను, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా సేవలు అందించారు.

ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమెకు అద్భుతమైన నేపథ్యం ఉంది. ప్రముఖ కవి ఆరుద్ర జీవితంలోకి వచ్చిన ఆమె ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా కూడా నిలిచారు. మద్రాసు నగరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న నాలుగైదు దశాబ్దాలలో చాలా విషయాలు ఆమెకు తెలుసు. ఎన్నో విషయాలకు ఆమె సాక్షిగా ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని అస్మాన్ ఘాట్లో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని తాలూకా కోటనందూరులో 1930 డిసెంబర్ 31న జన్మించారు.

మద్రాస్ విశ్వవిద్యాలయంలో బిఎ పూర్తి చేసిన ఆమె.. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం ప్రాచీనాంధ్ర‌ సాహిత్యం చదివారు. 1954లో ఆరుద్రను వివాహం చేసుకోగా ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. 1951 నుంచే రామలక్ష్మి రచన ప్రస్థానం ప్రారంభించారు. పెళ్లి తర్వాత కూడా రామలక్ష్మి ఆరుద్ర అనే కలం పేరుతో ఆమె ఎన్నో రచనలు చేశారు. ఆంధ్ర పత్రికలో ఆమె సుదీర్ఘకాలం ప్రశ్న జవాబు పేరుతో నిర్వహించిన శీర్షిక ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆమె కెరీర్ లో మొత్తం 100కు పైగా పుస్తకాల్లో రాశారు ఆమె ఎన్నో సినిమాలకు కథలు కూడా అందించారు.

1975లో జీవనజ్యోతి సినిమా కథకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. కాసా సుబ్బారావు నిర్వహించిన స్వతంత్య్ర‌ దినపత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డును సైతం ఆమె అందుకున్నారు. ఎన్నో స్త్రీ సంక్షేమ సంఘాలలో సేవలు అందించి.. మహిళా శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. అలాగే కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు రీజనల్ సభ్యురాలుగా కూడా ఆమె పనిచేశారు. రామలక్ష్మి పుట్టింది కాకినాడలో అయినా ఆమె చదువంతా చెన్నైలోనే కొనసాగింది.. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ స్టూడెంట్.

ఆమె అక్కడ చదువుకోవడం తోనే ఆమె ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు సాధించింది. అయామ్ ఏ స్టెల్లా మెరియన్ అని రామలక్ష్మి ఎన్నో సందర్భాల్లో గర్వంగా చెప్పుకునేవారు. కాలేజీలో ఒక కార్యక్రమానికి ప్రఖ్యాత జర్నలిస్టు కాసా సుబ్బారావు హాజరయ్యారు. రామలక్ష్మి ఉపన్యాసం చూసిన ఆయన ముగ్ధుడు అయిపోయారు. పరీక్షలు అయిపోయాక తనను కలవమని చెప్పి తన ఇంగ్లీష్ పత్రికలో ఆమెకు జర్నలిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. ఆమె ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సాహితీ చర్చలు జరిగేవి. వాటికి ఆరుద్ర, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ లాంటి గొప్ప వాళ్ళు హాజరయ్యే వారు.

ఆ క్రమంలోనే ఆరుద్ర – రామలక్ష్మి పరస్పరం ఇష్టపడి 1954 ఏప్రిల్ 30న రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నారు. ఈ పెళ్లికి దర్శకుడు హెచ్ఎం రెడ్డి, శ్రీశ్రీ సాక్షి సంతకాలు పెట్టారు. తన పెళ్లికి శ్రీశ్రీ సాక్షి సంతకం చేయాలని ఆరుద్ర పట్టు పట్టడం వల్లే ఇది జరిగింది. అయితే శ్రీశ్రీ సరదాగా రామలక్ష్మిని అత్తగారు అని పిలిచేవారు.. అయితే ఈ ధోర‌ణిని రామలక్ష్మి చివరి వరకు వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఆరుద్ర అనారోగ్యానికి గురైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డితో ఆమె స్వయంగా మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూసారు.

విచిత్రం ఏంటంటే తాను మరణించినప్పుడు ఎటువంటి హంగామా చేయవద్దు అని ఆరుద్ర కోరారు. 1998లో ఆరుద్ర మరణించినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు స్నేహితుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి చేసేశారు. ఆ తర్వాతే తన భర్త మరణ వార్తను ఈ లోకానికి తెలియజేయడంతో సాహితీ ప్రియులు చాలా బాధపడ్డారు. రామలక్ష్మి తాను ఓ గడుగ్గాయని, ఓ గయ్యాలని అని ఓపెన్‌గా చెప్పుకుంటారు. ఆమెకి సినిమా రంగంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. భానుమతి, రామకృష్ణ, జ‌య‌లలిత, వాణిశ్రీ లాంటి వారితో ఆమె స్నేహం చేసేవారు. దాసరి నారాయణరావు స్టోరీ డిపార్ట్మెంట్లో తెరవెనక ఉండి పనిచేసిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news