MoviesSusmitha చిరు పెద్ద కూతురు సుస్మిత‌కు టాలీవుడ్ బిగ్ షాక్ ఇచ్చిందే…!

Susmitha చిరు పెద్ద కూతురు సుస్మిత‌కు టాలీవుడ్ బిగ్ షాక్ ఇచ్చిందే…!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె కూడా సినిమా రంగంలో త‌న ల‌క్ ప‌రీక్షించుకునేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే వెబ్‌సీరిస్‌లు నిర్మిస్తూనే ఇటు వెండితెర‌పై కూడా ఆమె నిర్మాత‌గా మారారు. సంతోష్ శోభ‌న్ హీరోగా సుస్మిత నిర్మాత‌గా ప్ర‌శాంత్ దిమ్మెల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా పేరు శ్రీదేవి శోభ‌న్‌బాబు. ఈ నెల 18న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది

సుస్మిత అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను చాలా ప్రెస్టేజ్‌గా తీసుకున్నారు. మెగాస్టార్ కుమార్తె కావ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సూప‌ర్ హిట్ కొట్టి తండ్రి లెగ‌సీని ఇండ‌స్ట్రీలో ఘ‌నంగా కంటిన్యూ చేయాల‌ని చూస్తోంది. అయితే సంతోష్ శోభ‌న్‌కు ఎప్పుడూ కాలం క‌లిసి రావ‌డం లేదు. ఒక్కోసారి కంటెంట్ ఎంత బాగున్నా కుర్ర హీరోల‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆ మ‌ధ్య బెల్లంకొండ స్వాతిముత్యం సినిమా రాంగ్ టైమింగ్‌లో వ‌చ్చి ప్లాప్ అయ్యింది.

ఇక ఇప్పుడు సుస్మిత తీస్తోన్న శ్రీదేవి శోభ‌న్‌బాబు కూడా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ముందు వెన‌క గ‌ట్టి సినిమాలు వ‌స్తున్నాయి. 10న క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ వ‌స్తోంది. మైత్రీ వాళ్లు దీనికి నిర్మాత‌లు. ఇక 17న ధ‌నుష్ స‌ర్ వ‌స్తోంది. సితార బ్యాన‌ర్ కాబ‌ట్టి భారీ ప్లానింగ్ ఉంది ఈ సినిమాకు. ఇక అదే రోజు కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కూడా రిలీజ్ అవుతోంది. దీనికి నెల రోజులుగా ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు.

ఇక క‌ళ్యాణ్‌రామ్ అల వైకుంఠ‌పురంలో హిందీ రీమేక్ షెహజాదాని 17నే వ‌స్తోంది. ఇంత గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో ఏ మాత్రం అంచ‌నాలు లేని శ్రీదేవి శోభ‌న్‌బాబు ఎంత వ‌ర‌కు నెగ్గుకు వ‌స్తుంద‌న్న‌ది చెప్ప‌లేం. ఏదేమైనా ఇది సుస్మిత కొణిదెల‌కు పెద్ద ఇబ్బందిగా మారుతుంద‌ని కూడా ఇండ‌స్ట్రీ జ‌నాలు లెక్క‌లు వేసుకుంటున్నారు. పోనీ చిరు కుమార్తె సినిమా క‌దా ? త‌మ సినిమాలు వాయిదా వేసుకుందాం అని జాలిప‌డే ఇండ‌స్ట్రీ జ‌నాలు ఇప్పుడు ఎంత మాత్రం లేరు.

అస‌లు సంక్రాంతికి చిరు వాల్తేరు వీర‌య్య సినిమా థియేట‌ర్ల కోస‌మే నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఏ మాత్రం అంచ‌నాలు లేని ప్లాప్ హీరోతో చిరు కుమార్తె సినిమా తీస్తే ఎవ‌రు మాత్రం సోలో రిలీ్‌కు స‌హ‌క‌రిస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news