MoviesNTR ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ ని సంతోష పెట్టిన స్టార్...

NTR ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ ని సంతోష పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్.. ఇది కదా రా అభిమానులకు కావాల్సింది..!!

టాలీవుడ్ నందమూరి నట వరసుడి గా హీరోగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుని.. తన నెక్స్ట్ సినిమాలను ఆ ఋఏంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఆరారార్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న్ ఎన్టీఆర్ .. ఆ తర్వాత కొరటాల శివతో సినిమాకు కమిటీ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సంతోషపడే వార్తను చెప్పుకొచ్చారు స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న నాగ వంశీ.

మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో సినిమా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది . ఆ సినిమాను అఫీషియల్ గా ప్రకటించి కొన్నాళ్ల తర్వాత వాయిదా వేశారు . దానికి రీజన్ ఏంటో ఇప్పటివరకు వాళ్లు ప్రకటించనే లేదు . ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించాలని అటువైపుగా అడుగులు వేస్తూ బిజీ అయిపోయారు ..తారక ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్స్ లో బిజీగా ఉండిపోయాడు.

త్వరలోనే కొరటాలతో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇలాంటి క్రమంలోనే నాగవంశం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు . “ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్థానం అమాంతం పెరిగిపోయింది.. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్నాడు ..ఆయన స్థాయికి తగ్గట్టే సినిమా కధ.. కంటెంట్ ఉండాలి.. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాను క్యాన్సిల్ చేశాం.. త్వరలోనే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక భారీ పౌరాణిక నేపథ్యంలో సినిమా రాబోతుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే వెల్లడిస్తాం”..అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ను ఎప్పటినుంచో పౌరాణిక సినిమాలో చూడాలి అని..ఆయన ఆ సినిమాలో నటిస్తే బాగుండు అని కోరుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news