MoviesUppena కధ వినకుండానే ఉప్పెన సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్...

Uppena కధ వినకుండానే ఉప్పెన సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో .. కారణం తెలిస్తే “తూ” అనకుండా ఉండలేరు..!!

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా ..”ఉప్పెన”. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్గా కూడా ఇంట్రడ్యూస్ అయింది ఈ సినిమా తోనే. ఈ సినిమా వైష్ణవ్ కి ఎలాంటి హిట్ ఇచ్చిందో తెలియదు కానీ.. ఉప్పెన సినిమా ద్వారా కృతి శెట్టి మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఎంతలా అంటే ఆ తర్వాత రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి.. కృటిశెట్టి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగి పోయే విధంగా మారిపోయింది .

దీంతో టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా కృతి శెట్టికి ఆఫర్లు ఇచ్చారు . అయితే ఎవ్వరు ఊహించిన విధంగా ఆ మూడు సినిమాలు బోల్తా కొట్టాయి. వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన సినిమా తర్వాత హిట్ కొట్టిందే లేదు . చేసిన రెండు మూడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. అయితే డైరెక్టర్ బుచ్చి బాబు ఈ కథకు ముందు అనుకున్న హీరో వైష్ణవ్ కాదట. ఈ story రాసుకున్నప్పుడు హీరో అనుకున్నది నేచురల్ స్టార్ హీరోని నానిని హీరోగా అనుకున్నారట . ఇదే విషయం ఆయనకు చెప్పి ..ఆయనకు కథ వినిపించాలని చాలా ఆశగా నాని ఇంటికి వెళ్ళారట.

అయితే అప్పటికే ఫుల్ కాల్ షీట్స్ బిజీగా ఉన్న నాని ..బుచ్చిబాబు అసలు ఎలాంటి కధ తో వచ్చాడో వినకుండానే రిజెక్ట్ చేశాడట. ఆ తరువాత పలువురు యంగ్ హీరోస్ వద్దకు వెళ్ళినా..స్టోరి నచ్చినా..పాపులారిటీ లేని డైరెక్టర్ కావడంతో అందరు రిజెక్ట్ చేసారట. నిజంగా ఒకవేళ నాని ఈ సినిమా కధ విని చేసి ఉంటే ..నాని ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడేది. చేతులారా వదిలేసుకున్నాడు నాని . ఇదే కాదు గతంలో చాలా హిట్ సినిమాలు నాని ఇదేవిధంగా వదిలేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news