Moviesపూజా హెగ్డే ను జాత‌కం పేరుతో కీలుబొమ్మ చేసిన టాలీవుడ్ స్టార్...

పూజా హెగ్డే ను జాత‌కం పేరుతో కీలుబొమ్మ చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌..!

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ అంటే ఇప్పుడు సినిమా బిజినెస్ ఇట్టే జరిగిపోతుంది. అంతటి క్రేజ్ తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసి భారీ హిట్స్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయనకంటూ ఓ సపరేట్ మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు. నిర్మాతను కథతో కన్విన్స్ చేస్తే అడిగినంత బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఏకంగా రెండు నిర్మాణ సంస్థలే త్రివిక్రమ్‌ చేతిలో ఉన్నాయి.

ఆ రెండు సంస్థ‌లూ పెద్ద‌వే. సితార సంస్థ‌, హారిక హాసిని రెండూ కూడా త్రివిక్ర‌మ్ చెప్పిన‌ట్టు ఆడే బొమ్మ‌లే.
దీన్నిబట్టే ఆయన సత్తా ఏంటో అర్థమవుతోంది. హీరోలు కూడా త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోలు ఆయన కథ ఎప్పుడు చెప్తారో అని ఎదురుచూస్తుంటారు. ఇక హీరోయిన్స్ అయితే, అయ్యగారి మోక్షం కోసం పడిగాపులు కాస్తుంటారు.

ఆయనకి కనెక్టే హీరోయిన్ దొరికితే వదలరనే టాక్ అటు ఇండస్ట్రీలో ఇటు జనాలలో బలంగా ఉంది. అయినా వాటిని లెక్కచేయరు. అందుకే, సమంత లాంటి హీరోయిన్ ఆయన దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసి స్టార్‌గా మారింది. ఇలియానా కూడా వ‌రుస‌గా త్రివిక్ర‌మ్‌తో సినిమాలు చేసింది. ఈ క్రమంలో మన గురూజికి బాగా కనెక్ట్ అయింది పూజా హెగ్డే.

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో త్రివిక్రం పూజాకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అంతేకాదు, బుట్టబొమ్మ అనే ముద్దుపేరునూ ఇచ్చారు. తెలుగులో ఇక అడ్రస్ ఉండదనుకున్న సమయంలో పూజా హెగ్డేకి ఇప్పుడు ఏకంగా మ‌హేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక తన మార్కెట్ పెంచి భారీ రెమ్యునరేషన్ అందుకునే సత్తా ఇచ్చింది త్రివిక్రం.

అందుకే, ఇప్పుడు ఆయన సలహాలనే ఎక్కువగా పాటిస్తుందట. రాధే శ్యామ్‌, ఆచార్య లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో అమ్మడి జాతకం చూసిన త్రివిక్రమ్‌ కొంతకాలం కొత్త ప్రాజెక్ట్స్‌ను ఒప్పుకోవద్దని సలహా ఇచ్చారట. గురూజీ అంటూ లవ్లీగా పిలిచే పూజా హెగ్డే ఆయన చెప్పినట్టే సరే అనిందట. ప్రస్తుతం పూజా కొత్త సినిమా ఒప్పుకోవాలంటే నిర్మాతలెవరైనా త్రివిక్రమ్‌ ని సంప్రదించాలని అర్థమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news