Moviesఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌: బాల‌య్య - ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్...

ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌: బాల‌య్య – ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోందెవ‌రు…!

నిజంగానే ఇది టాల‌వుడ్ సినీ అభిమానుల‌కు, టాలీవుడ్ జ‌నాల‌కు ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ అని చెప్పాలి. బాల‌య్య‌, ప‌వ‌న్ ఇద్ద‌రూ టాలీవుడ్‌లో రెండు వేర్వేరు కాంపౌండ్‌ల‌కు చెందిన స్టార్ హీరోలు. ఈ ఇద్ద‌రు హీరోలు ఎప్పుడు అయినా ఒకే వేదిక మీద‌కు వ‌స్తారా ? అన్న సందేహాలు యేళ్ల నుంచీ ఉన్నాయి. వాటిని ప‌టాపంచ‌లు చేస్తూ వీరిద్ద‌రు ఆహా ఓటీటీ అన్‌స్టాప‌బుల్ షో కోసం ఒక్క‌ట‌య్యారు. ఇదో సంచ‌ల‌నం. వీరిద్ద‌రు క‌లిసి చేసిన ఫ‌స్ట్ ఎపిసోడ్ ఇప్ప‌టికే ఆహాలో స్ట్రీమింగ్ అయ్యి ఎన్నో సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.

ఇక ఈ నెల 10న ప‌వ‌న్ – బాల‌య్య రెండో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. చాలా మందికి ప‌వ‌న్‌, బాల‌య్య అంటే నార్త్‌, సౌత్ పోల్స్ అన్న భ్ర‌మ‌ల్లో ఉన్నారు. అయితే వీరిద్ద‌రు గ‌తంలో కూడా చాలాసార్లు క‌లుసుకున్నారు. ఈ విష‌యాన్ని టాక్ షోలో వీరిద్ద‌రే స్వ‌యంగా చెప్పారు. ప‌వ‌న్ సుస్వాగ‌తం సినిమా షూటింగ్ కు కూడా బాల‌య్య వ‌చ్చాడు. ఓ సంద‌ర్భంలో చిరుయే స్వ‌యంగా ప‌వ‌న్‌ను బాల‌య్యకు ప‌రిచయం చేశార‌ట‌.

ఇక సినీ తార‌ల క్రికెట్ మ్యాచ్‌లో బాల‌య్య ప్రాక్టీస్ చేస్తున్న‌ప్పుడు కూడా తాను ప‌క్క‌నే ఉండి ఎన్నోసార్లు గ‌మ‌నించాన‌ని ప‌వ‌న్ స్వ‌యంగా చెప్పారు. ఇక ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లానింగ్ రెడీ అవుతోంది. వీరిని ఆహా వేదిక మీద‌కు తీసుకువ‌చ్చిన అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ వీరి మ‌ల్టీస్టార‌ర్‌కు కూడా ప్లాన్ చేస్తున్నార‌ట‌. నిజంగా వీరిద్ద‌రి మ‌ల్టీస్టార‌ర్ పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే అది నిజంగా ఇండియ‌న్ సినిమా స్క్రీన్‌పై పెను సంచ‌ల‌న‌మే అవుతుంది.

ప‌వ‌న్ ఎంత స్టార్ హీరో అయినా మ‌ల్టీస్టార‌ర్లు చేస్తున్నాడు. వెంకీతో గోపాల గోపాల – రానాతో భీమ్లానాయ‌క్ సినిమాలు చేశాడు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో చేస్తున్నాడు. అలాగే బాల‌య్య‌తో కూడా యాక్ష‌న్‌, సెంటిమెంట్ క‌ల‌గ‌లిసిన స్టోరీలో న‌టిస్తే ఖ‌చ్చితంగా ఆ సినిమా టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే పెను సంచ‌ల‌నం రేపుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అల్లు అర‌వింద్ ఒక్క‌డే వీరిని క‌లిపే సాహ‌సం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి నిజంగానే ఈ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అవ్వాల‌ని అంద‌రం కోరుకుందాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news