MoviesBalakrishna బాల‌య్య‌తో త‌ప్పా ఎవ్వ‌రితోనూ సినిమా చేయను ..న‌ట‌సింహం కోసం పెద్ద...

Balakrishna బాల‌య్య‌తో త‌ప్పా ఎవ్వ‌రితోనూ సినిమా చేయను ..న‌ట‌సింహం కోసం పెద్ద రిస్క్ చేస్తోన్న స్టార్ డైరెక్ట‌ర్‌…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహారెడ్డి సినిమా కూడా ఓ మోస్త‌రు టాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్లు సొంతం చేసుకుంది. వీర‌సింహారెడ్డి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 80 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. బాల‌య్య కెరీర్‌లో ఇదే అత్య‌ధిక షేర్ కావ‌డం విశేషం.

పైగా సంక్రాంతికి చిరు వాల్తేరు వీర‌య్య సినిమాతో పోటీ ప‌డి మ‌రీ ఈ రేంజ్‌లో వ‌సూళ్లు అంటే మామూలు విష‌యం కాదు. బాల‌య్య ఇప్పుడున్న ఫామ్‌కు ప్ర‌తి ఒక్క స్టార్ డైరెక్ట‌ర్ కూడా బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని పంతం వేసుకుని మ‌రీ కూర్చొంటున్నారు. ఎవ‌రో ఎందుకు మ‌లినేని గోపీచంద్‌, అనిల్ రావిపూడి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బాల‌య్య‌తోనే సినిమా చేయాల‌ని చేశారు.

ఇప్పుడు ఈ లిస్టులో చాలా మంది పెద్ద డైరెక్ట‌ర్లే రేసులో ఉన్నారు. ఇక టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అయితే బాల‌య్య బాబు కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ రాస్తున్నాడు. అస‌లే వ‌రుస ప్లాపుల‌తో కొట్టుమిట్టాడుతోన్న టైంలో బాల‌య్య పూరికి పైసా వ‌సూల్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా స‌క్సెస్ కాక‌పోయినా బాల‌య్య‌ను స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేసింది.

ఆ త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్‌తో హిట్ కొట్టిన పూరి లైగ‌ర్ దెబ్బ‌తో పాతాళానికి ప‌డిపోయాడు. అస‌లు లైగ‌ర్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ పూరితో చేసే జ‌న‌గ‌న‌మ‌ణ మ‌ధ్య‌లోనే ఆపేశాడు. స్టార్ హీరోలు కాదు క‌దా.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూరిని ద‌గ్గ‌ర‌కే రానివ్వ‌డం లేదు. అయితే పూరి మాత్రం బాల‌య్య‌తో సినిమా చేసి తానేంటో ఫ్రూవ్ చేసుకుంటాన‌ని.. బాల‌య్య ఛాన్స్ ఇచ్చే వ‌ర‌కు వెయిట్ చేస్తాన‌ని పంతం వేశాడ‌ట‌.

బాల‌య్య త‌న క‌థ‌కు ఓకే చెప్పేవ‌ర‌కు తాను క‌థ‌లు రాస్తూ ఉంటాన‌ని.. బాల‌య్య‌తో సినిమా చేసి హిట్ కొట్టాకే తానేంటో చూపిస్తాన‌ని శ‌ప‌థం కూడా చేశాడ‌ట‌. ఇందుకోసం త‌న టీంతో క‌లిసి గోవాలో మ‌కాం వేసి మ‌రీ స్క్రిఫ్ట్‌ను రెండు, మూడు నెల‌లుగా చెక్కుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇది తండ్రి, కొడుకుల నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్‌గా సాగే స్టోరీ అంటున్నారు.

బాల‌య్య ఒప్పుకోక‌పోయినా ఛార్మీ ద్వారా లేదా ఏ లాబీయింగ్ వాడి అయినా ఛాన్స్ కొట్టాల‌ని పూరి క‌సితో ఉన్నాడ‌ట‌. ముఖ్యంగా త‌న‌ను ప‌క్క‌న పెట్టేసిన కొంద‌రు టాలీవుడ్ హీరోల‌కు ఆన్స‌ర్ ఇవ్వాల‌న్న క‌సితోనే బాల‌య్య‌తో సినిమా చేస్తున్నాడ‌ట‌. మ‌రి పూరి విన‌తిని బాల‌య్య లెక్క‌లోకి తీసుకుంటాడా ? లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news