MoviesPriyanka Chopra తెలుగు హీరో కోసం ప్రియాంకా చోప్రా సంచలన నిర్ణయం.....

Priyanka Chopra తెలుగు హీరో కోసం ప్రియాంకా చోప్రా సంచలన నిర్ణయం.. బాలీవుడ్ లో మగాళ్లే లేరా..?

ఇది నిజంగా తెలుగు హీరోలకి గర్వించ తగ్గ విషయం అనే చెప్పాలి . ఒకప్పట్లో బాలీవుడ్ బ్యూటీస్ తెలుగు హీరోలంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు.. మన సినిమాలో నటించాలంటే భయపడేవారు.. మాది ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాం అని.. తెలుగు సినిమా అంతస్థాయికి ఎదగలేదని కామెంట్స్ చేసే వాళ్ళు. ఇదే విషయాన్ని చిరంజీవి సైతం చెప్పుకొచ్చాడు . కాగా ఇప్పుడు ట్రెండ్ మారింది .

కరోనా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా పడిపోయింది . అడపాదడపా ఒక్కొక్క సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని లేపడానికి ట్రై చేస్తున్నా.. ఇంకా బాలీవుడ్ కోలుకోలేదు . ఈ క్రమంలోనే తెలుగులో రాజమౌళి లాంటి స్టార్ దర్శకులు .. తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ దేశాలకు పాకేలా చేశారు . కాగా ఇలాంటి క్రమంలోనే గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. తెలుగు హీరో సినిమాకి సైన్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది.

ఎస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా .. తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నెగటివ్ రోల్ చేయబోతున్నాడు. పఠాన్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే హృతిక్ ప్రియాంకా తో రొమాన్స్ చేయాలి అనుకున్నాడట. కానీ ప్రియాంకా ..ప్రభాస్ కే ఇంట్రెస్ట్ చూయిస్తుందట..!!

Latest news