MoviesPavitra-Naresh ప‌విత్ర‌కు సిగ్గులేదు… న‌రేష్ వ‌దిలేస్తాడు… బూతుల‌తో రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

Pavitra-Naresh ప‌విత్ర‌కు సిగ్గులేదు… న‌రేష్ వ‌దిలేస్తాడు… బూతుల‌తో రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

వామ్మో కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ శ్రీరెడ్డి మ‌రోసారి ప‌చ్చి బూతుల‌తో రెచ్చిపోయింది. ఈ సారి ఏకంగా న‌రేష్‌తో పాటు ప‌విత్రా లోకేష్‌ను టార్గెట్‌గా చేసుకుంది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వ‌స్తోన్న శ్రీ రెడ్డి త‌న తాజా యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ గురించి అడ‌డ‌గా తీవ్రంగా విరుచుకు ప‌డింది. అస‌లు న‌రేష్‌ను అయితే విన‌డానికే వీళ్లేనంత బండ బూతుల‌తో ఏకి ప‌డేసింది. ఈ వ‌య‌స్సులో మూతులు మూతులు నాక్కుంటూ ప‌బ్లిక్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ మండిప‌డింది

అంత‌గా కావాల‌నుకుంటే పెళ్లి చేసుకోవాలే కాని.. ఈ వ‌య‌స్సులో అదా ప్ర‌పోజ్ చేయ‌డం.. పెళ్లీడు కొచ్చిన కొడుకును పెట్టుకుని ఇవేం ప‌నులు.. వాళ్లు ఎలా ఫీల‌వుతారు.. స్కూల్‌, కాలేజ్‌కు వెళ్లిన‌ప్పుడు ఏంట్రా మీ నాన్న చేసిన ప‌నులు ఏవైనా బాగున్నాయా ? అంటే మీ పిల్ల‌ల మ‌న‌స్సు ఎంత క్షోభ ప‌డుతుంద‌ని గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది. నీ ఆవిడ‌కు, నీ పిల్ల‌ల‌కు నీతో ఎంతో టార్చ‌ర్ అని చెప్పింది.

ఇలాంటి ప‌నుల వ‌ల్లే యూత్ చెడిపోతున్నార‌ని.. అయినా ప‌విత్ర‌కు సిగ్గు ఉండాలి క‌దా ? అని ఆమెను కూడా ఏకేసింది. మా అసోసియేష‌న్ రాజ‌కీయాల గురించి న‌రేష్ ఇన్ని ప‌తివ్ర‌త క‌బుర్లు చెపుతాడు క‌దా ? ఒక‌రితో కాపురం చేయ‌డం మాత్రం రాద‌ని.. రేపు ఆవిడ‌ను ( ప‌విత్ర‌ను) కూడా ఎప్పుడు వదిలేస్తాడో ? తెలియ‌దు. ఆయ‌న పంది క‌న్న‌ట్టు పిల్ల‌ల‌ను కని వాళ్ల‌ను వ‌దిలేశాడు.. ఆమె పిల్ల‌ల‌ను వ‌దిలేసి వ‌చ్చేసింది. న‌రేష్ ప‌విత్ర మూతి నాకుతున్నాడు.. సిగ్గు ఉండాలంటూ ఫైర్ అయ్యింది.

అస‌లు ఆ ప్ర‌పోజ‌ల్ ఏంటి ? సిగ్గుండాలి క‌దా ? క‌నీసం కొత్త‌గా పెళ్లి చేసుకునే వాళ్లు కూడా ఇలాంటి టీజ‌ర్ వ‌ద‌ల్లేద‌ని… ఇంత బ‌రితెగింపు ఏంటో నాకు అర్థం కాలేదు.. ఈ వ‌య‌స్సులో న‌రేష్ ఇవ‌న్నీ చేస్తుంటే ఆయ‌న‌కు బుద్ధి చెప్పేవాళ్లు ఎవ్వ‌రూ లేరా ? అంటూ శ్రీరెడ్డి దుమ్మెత్తిపోసింది. ఇక ప‌విత్ర‌ను కూడా శ్రీరెడ్డి ఏ మాత్రం వ‌ద‌ల్లేదు.

ప‌విత్ర అంటూ పేరు పెట్టుకుని ఆ పేరుకే క‌ళంకం తీసుకువ‌స్తోంద‌ని.. ఆయ‌న మెంటలోడు.. పోనీ నీ బుద్ధి అయినా ఏమైందంటూ మండిప‌డింది. చేసేవ‌న్నీ ప‌తివ్ర‌త క్యారెక్ట‌ర్లు.. నిజంలోకి వ‌చ్చేసరికి ఇంత అప‌విత్ర‌మైన క్యారెక్ట‌ర్లా ? వ‌ద్దు పిల్ల‌లు ఉన్నార‌ని న‌రేష్‌ను నువ్వు అయినా రిజెక్ట్ చేయాలి క‌దా ? సిగ్గులేని జ‌న్మ అంటూ ఒక్క‌టే బండ బూతులు తిట్టేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news