MoviesKalyan Ram క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతికి బాల‌య్య భార్య వ‌సుంధ‌ర‌కు ఉన్న...

Kalyan Ram క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతికి బాల‌య్య భార్య వ‌సుంధ‌ర‌కు ఉన్న రిలేష‌న్ ఇదే..!


నందమూరి వంశం నుంచి ప్రస్తుతం టాలీవుడ్ లో మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు హీరోలుగా కొనసాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తిరిగిలేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కళ్యాణ్ రామ్ కూడా బింబిసారతో కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తాజాగా అమిగోస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి పరిశీలిస్తే అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత వరుస‌ పెట్టి ఎన్ని సినిమాలు చేస్తున్నా తన రేంజ్‌కు తగిన హిట్ అయితే పడలేదు. పటాస్ – 118 – బింబిసారా లాంటి సినిమాలు మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో స్పెషల్గా నిలిచిపోతాయి. ఓం త్రిడి లాంటి వైవిధ్యమైన సినిమాలు కూడా కళ్యాణ్ రామ్ తెరకెక్కించాడు. సినిమాల జయాప‌జయాలతో సంబంధం లేకుండా తన తాత ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తానే నిర్మాతగా సినిమాలు నిర్మించాడు.

ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ విషయానికొస్తే భార్య స్వాతితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిది పెద్దలకు కుదిర్చిన వివాహం. 2006 ఏప్రిల్ లో కళ్యాణ్ రామ్ – స్వాతి వివాహం జరిగింది. కళ్యాణ్ రామ్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో అసాధ్యుడు సినిమా షూటింగ్ నడుస్తోంది. ముందుగా హరికృష్ణ ఓ బంధువుల ఫంక్షన్లో స్వాతిని చూసి ఆమె అయితే కళ్యాణ్ కు ఈడు.. జోడు బాగుంటుందని అనుకున్నారు. హరికృష్ణ ఫ్యామిలీకి స్వాతి వాళ్ళ కుటుంబానికి దూరపు బంధుత్వం ఉంది.

స్వాతి ఎవరో కాదు బాలకృష్ణ భార్య వసుంధరకు దగ్గర రిలేషన్. స్వాతి తండ్రికి ఫార్మా – ఎలక్ట్రికల్ కంపెనీలు ఉన్నాయి. ఆమె అప్పటికే చెన్నైలో మెడిసిన్ పూర్తి చేసింది. స్వాతితో కళ్యాణ్‌రామ్ కు పెళ్లి చేయాల‌ని హరికృష్ణ, ఆయన భార్య లక్ష్మి నిర్ణయం తీసుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ కొద్ది రోజులు ఆగాలన్న కండిషన్ పెట్టారు. అయితే త‌ల్లి లక్ష్మీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కళ్యాణ్ కు వెంటనే పెళ్లి చేయాల‌ని నిర్ణయం తీసుకుని ఒత్తిడి చేసింది. దీంతో తన తల్లి లక్ష్మి కోరిక మేరకు కళ్యాణ్ ఓకే చెప్పక తప్పలేదు.

అయితే పెళ్లి తర్వాత స్వాతిని ఉన్నత చదువులు చదివించాలని… ఎమ్మెస్ పూర్తి చేయించాలని హరికృష్ణకు కోరిక ఉండేది. ఆయ‌న పిల్ల‌ల్లో ఎవ‌రో ఒక‌రిని డాక్ట‌ర్‌ను చ‌దివించాల‌న్న కోరిక ఆయ‌న‌కు ఉండేది. ఆ కోరిక స్వాతితో అయినా తీర్చుకోవాల‌ని అనుకున్నారు. అయితే ఆమె ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఇష్టం ఉందని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశారు. ఇక స్వాతి కుటుంబం కళ్యాణ్‌రామ‌మ్ కు సినిమాల పరంగాను.. వ్యాపార విషయాల్లోనూ ఎప్పుడు అండగా ఉంటూ వస్తోంది. స్వాతి సోదరుడు హరి కళ్యాణ్ రామ్ వ్యాపార, సినిమా నిర్మాణ వ్యవహారాలు అన్ని దగ్గరుండి మరి చూసుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news