MoviesSir Movie Review: సార్ రివ్యూ… మ‌న‌స్సును ట‌చ్ చేసిన మెసేజ్‌

Sir Movie Review: సార్ రివ్యూ… మ‌న‌స్సును ట‌చ్ చేసిన మెసేజ్‌

టైటిల్‌: సార్
నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, సముద్రఖని, సుమంత్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: యువరాజ్
మ్యూజిక్‌: జీవి ప్రకాష్ కుమార్
ఎడిటింగ్‌: నవీన్ నూలి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ, శ్రీకర స్టూడియోస్
రిలీజ్ డేట్‌: 17 ఫిబ్ర‌వ‌రి, 2023

ఇటీవ‌ల వ‌రుస‌గా త‌మిళ హీరోలు తెలుగు ద‌ర్శ‌కుల వెంట‌ప‌డుతున్నారు. బాహుబ‌లి, పుష్ప‌, త్రిబుల్ ఆర్ సినిమాలు తెలుగు సినిమా స్టామినాను నేష‌న‌ల్ వైడ్‌గా తీసుకుపోయాయి. దీంతో తెలుగు ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తే క‌మ‌ర్షియ‌ల్‌గా తిరుగులేని బ్రేక్ వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో వారు ఉన్నారు. సంక్రాంతికి విజ‌య్ వార‌సుడుతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో చూశాం. మ‌న వంశీ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఇప్పుడు త‌క్కువ టైంలోనే మ‌రో తెలుగు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ఏకంగా ధ‌నుష్‌తో తీసిన సార్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. సితార బ్యాన‌ర్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
బాలగంగాధర్ తిలక్ (ధనుష్) త్రిపాఠి (సముద్రఖని) న‌డిపే విద్యాసంస్థ‌ల్లో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా తిల‌క్ గ‌వ‌ర్న‌మెంట్ కాలేజ్ లెక్చ‌ర‌ర్‌గా వెళ‌తాడు. అక్క‌డ బ‌యాల‌జీ లెక్చ‌ర‌ర్ మీనాక్షి ( సంముక్త మీన‌న్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. బాలు వెళ్లాక గ‌వ‌ర్న‌మెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అంద‌రూ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌వుతారు. బాలు అక్క‌డ ఉంటే త‌న కాలేజ్ బిజినెస్ పాడ‌వుతుంద‌ని.. బాలు జాబ్ చేయ‌కుండా.. ఆ ఊరు పిల్ల‌లు చ‌దువుకోకుండా అడ్డు ప‌డ‌తాడు. ఆ టైంలో త్రిపాఠితో బాలు చేసిన స‌వాల్ ఏంటి ? ఆ ఊరు పిల్ల‌లు చ‌దువుకుని ప్ర‌యోజ‌కుల‌య్యారా ? అస‌లు ఆ ఊరి కోసం బాలు ఏం చేశాడ‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
ఇది కొత్త క‌థ కాదు. కానీ ద‌ర్శ‌కుడు వెంకీ క‌థ‌ను చెప్పిన తీరు చాలా బాగుంది. స్క్రీన్ ప్లేలో వెంకీ చాలా వ‌ర‌కు త‌న మ్యాజిక్ చూపించాడు. తెలిసిన సీన్లే ఉన్నా దానికి ఎమోష‌న్ జ‌త చేయి స్క్రీన్ మీద మాయ చేశాడు. చ‌దువును మార్కెట్ల వ్యాపారంగా ఎలా మార్చారు ? అనే విష‌యాన్ని స్క్రీన్ మీద అద్భుతంగా చూపించాడు. గ‌వ‌ర్న‌మెంట్ కాలేజ్‌ల‌ను కూడా ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో సినిమాలో చ‌క్క‌గా చూపించారు.

ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్ హంగుల పేరుతో క‌థ‌ను రాంగ్ ట్రాక్ ప‌ట్టించ‌కుండా సినిమాను హానెస్ట్‌గా నడిపించాడు. అయితే చాలా చోట్ల సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నాడు. అలాగే, అణగారిన వర్గాల స్టూడెంట్స్ ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు వారిపై స‌మాజం ఒత్తిడి ఎలా ఉంటుందో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించాడు. అయితే నెరేష‌న్ మ‌రీ ప్లాట్‌గా ఉండ‌డం.. ట్విస్టులు లేక‌పోవ‌డం మైన‌స్‌. ఇంట‌ర్వెల్ సీన్‌తో పాటు చ‌దువు గొప్ప‌త‌నం ఏంటో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ధ‌నుష్ వివ‌రించి చెప్పే సీన్ బాగుంది. ధ‌నుష్ ఊరినుంచి వెళుతున్న‌ప్పుడు ఆయ‌న‌కోసం పిల్ల‌లు అంద‌రూ ఒక్క‌టై నిల‌బ‌డిన సీన్ ఎమోష‌న‌ల్‌గా హ‌త్తుకుంది.

ఫైన‌ల్‌గా చ‌దువుకోవాలి కాని.. కొన‌కూడ‌దు అన్న లైన్ బాగుంది. సార్ పాత్రలో ధనుష్ న‌ట‌న మ‌న‌స్సును పిండేసింది. ఈ పాత్ర ధ‌నుష్ మిగిలిన పాత్ర‌ల‌తో కంపేరిజ‌న్ చేస్తే ఓ మెట్టు పైనే ఉంటుంది. హీరోయిన్ సంయుక్త త‌న పాత్ర వ‌ర‌కు మెప్పించింది. స‌ముద్ర‌ఖ‌ని కార్పోరేట్ విద్యాసంస్థ‌ల అధినేత‌గా బాగా న‌టించాడు. హైప‌ర్ ఆది ఉన్నంత సేపు కామెడీ పండింది. ఇక తనికెళ్ల భరణి, సాయి కుమార్ లాంటి వాళ్ళు పాత్రలకు తగినట్టు మెప్పించారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజ్ :
టెక్నిక‌ల్‌గా జీవీ ప్ర‌కాష్‌కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హెల్ఫ్‌. మాస్టారు మాస్టారు సాంగ్ విజువ‌ల్‌గా కూడా అదిరిపోయింది. మిగిలిన పాట‌లు ఓకే. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్‌. న‌వీన్ నూలి ఎడిటింగ్ ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యింది. నిర్మాణ విలువ‌లు అద్భుతంగా ఉన్నాయి. ఎక్క‌డా రాజీలేదు. ఇక ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి విష‌యానికి వ‌స్తే నిజాయితీతో కూడిన ఓ క‌థ చెప్పాల‌నుకున్నాడు. మంచి క‌థ రాసుకున్నా.. ఆ క‌థ‌నం చెప్ప‌డంలో కొన్ని చోట్ల త‌డ‌బ‌డ్డాడు. మాట‌ల ర‌చ‌యిత‌గా ఎమోష‌న‌ల్‌గా మంచి డైలాగులు రాసుకున్నాడు.

ఫైన‌ల్‌గా…
ఈ సార్ ఓ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. మెయిన్ లైన్‌.. చాలా సీన్లు కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు నిజంగానే హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా చ‌దువు అనేది జీవితాల‌ను ఎలా ? మార్చేస్తుందో ఇందులో చక్క‌గా చూపించారు. చ‌దువు కోణంలో సాగిన ప్ర‌తి సీన్ బాగుంది. ఇక ధ‌నుష్ న‌ట‌న సూప‌ర్బ్‌. సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిస్ అయినా.. ఎమోష‌న‌ల్‌, మెసేజ్ మాత్రం బాగుంది.

ఫైన‌ల్ పంచ్‌: హానెస్ట్ మెసేజ్ ఈ సార్‌

సార్ రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news