MoviesNTR 30 నుండి అప్డేట్ వచ్చేసిందోచ్..ఇక అభిమానులకు పూనకాలే..!!

NTR 30 నుండి అప్డేట్ వచ్చేసిందోచ్..ఇక అభిమానులకు పూనకాలే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా సరే ..జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ..రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా ఏ హీరోకి లేదని చెప్పాలి . ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే ఎన్టీఆర్ అంటే ఇష్టపడే జనాలు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బడాబడా స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్ నటనకి.. డాన్స్ కి ఫిదా అవుతూ ఉంటారు .

ఇదే విషయాన్ని స్వయంగా వాళ్లే వెల్లడించారు. అంతెందుకు కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ స్టార్స్ కూడా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ లాంటి హీరోనే ఇంపార్టెంట్ అంటూ ఓపెన్ గా చెప్పేశారు . ఇంతకుమించి ఓ హీరోకి ఏం కావాలి చెప్పండి.. ఎన్టీఆర్ త్వరలోనే ఆస్కార్ అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు . ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే . కాగా దీంతో ఎన్టీఆర్ థర్టీ సినిమాపై కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ కూసింత అసహనానికి గురి అవుతున్నారు.

ఇలాంటి క్రమంలోనే అభిమానులకు పూనకాళ్లు తప్పించే అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ 30 సినిమాను కొరటాల ఏకంగా తొమ్మిది భాషలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోయే ఈ సినిమా చైనీస్, జపనీస్ , రష్యన్, అరబిక్, భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్టుగా నిలవబోతోంది అంటూ సినీ విశ్లేషకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ కొరటాల ఈసారి ఎన్టీఆర్ను డిఫరెంట్ లుక్ లో చూపించడానికి సిద్ధపడడమే అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news