Moviesబిగ్ షాకింగ్: రష్మిక అలాంటి వ్యాధితో బాధపడుతుందా..?..ఇన్నాళ్ళకు బయటపెట్టిన నేషనల్ క్రష్..!!

బిగ్ షాకింగ్: రష్మిక అలాంటి వ్యాధితో బాధపడుతుందా..?..ఇన్నాళ్ళకు బయటపెట్టిన నేషనల్ క్రష్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ..గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కన్నడ ఇండస్ట్రీలో “కిర్రాక్ పార్టీ” అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన పేరుని క్రేజ్ ని డబుల్ చేసుకుంది. ఈ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ..స్టార్ హీరోలను సైతం తన నటనతో ఆకట్టుకునింది.

ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. హ్యాండ్సమ్ హీరో అల్లు అర్జున్.. ఇద్దరు తనకు అవకాశాలు ఇచ్చారు . ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలని కరెక్ట్ గా వాడుకున్న రష్మిక మందన .. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్నటువంటి వన్ని బడా బడా సినిమాలే .. ఆమె చేసిన లాస్ట్ మూడు సినిమాలు డిజాస్టర్ అయినా సరే.. ఆమెను పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తిస్తున్నారు ..అంటే దానికి ఏకైక రీసన్ పుష్ప సినిమా అనే చెప్పాలి .

కాగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే రష్మిక మందన .. రీసెంట్ గా చేసిన పోస్ట్ తనకి జబ్బు ఉన్న విషయాన్ని బయట పెట్టేసింది. ఆమె రాసుకోస్తూ..” నాకు ఈ డే అంత చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది.. నిద్రలేచిన వెంటనే కార్డియో ఎక్సర్సైజ్ చేశా.. ఆ తర్వాత కొంచెం ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకున్న.. ఇక ఆ తర్వాత ఆరా,స్నోలు నన్ను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.. దీంతో ఏమీ చేయలేక మళ్ళీ వర్క్ అవుట్ లు చేసా.. ఆ తర్వాత డెర్మెట్ ని కలిసా.. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ క్యాన్సిల్ అయింది ..ఇంటికి వచ్చి పడుకున్న ” అంటూ తన డైలీ డే రొటీన్ షేర్ చేసింది .

ఈ క్రమంలోనే రష్మిక మందనకు చర్మవ్యాధి ఉందని ఆ కారణంగానే డెర్మటాలజిస్ట్ తో అపాయింట్ మెంట్ తీసుకుందని .. పుష్ప సినిమా షూటింగ్ టైం లోను ఆమె ఇదే విషయాన్ని రివిల్ చేసిందని జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే రష్మిక మందన లాంటి స్టార్ హీరోయిన్స్ కి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా ..? అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం రష్మిక మందన పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news