NewsShamukh-Deepthi "షణ్ముఖ్‌తో బ్రేకప్‌ కి కారణం అదే".. ఫస్ట్ టైమ్‌ స్పందించిన...

Shamukh-Deepthi “షణ్ముఖ్‌తో బ్రేకప్‌ కి కారణం అదే”.. ఫస్ట్ టైమ్‌ స్పందించిన దీప్తి సునైనా..!!

సెలబ్రిటీసే కాదు మాకు టాలెంట్ ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను బయట పెడుతూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పలు సామాన్యులు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సోషల్ మీడియా స్టార్స్ .. ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్లు కు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ దీప్తి సునైనా. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. వీళ్ళ పేర్లకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .

ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబల్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుని సోషల్ మీడియాలో నెంబర్ వన్ యూట్యూబర్లుగా దూసుకోబోతున్నారు. వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు . ఇదే విషయాన్ని ఓపెన్ గా ఎన్నో సందర్భాల్లో చెప్పారు . అయితే షణ్ముఖ్.. బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తోటి యూట్యూబఅర్.. కంటెస్టెంట్ సిరితో నడిపిన యవ్వారం మామూలుగా లేదు.

ఈ జంటని చూసిన ఎవరైనా సరే హాట్ కపుల్ అంటూ కామెంట్ చేయక తప్పదు . కాగా హౌస్ లో వాళ్ళిద్దరి రొమాన్స్ చూసిన దీప్తి సునయన ..అతగాడు బయటికి రాగానే బ్రేకప్ చెప్పేసింది . వీళ్లు మళ్లీ కలుస్తారు అంటూ చెప్తున్నా .. ఆ సూచనలు అయితే కనబడట్లేదు .. రీసెంట్ గా సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసిన దీప్తి సునయనకు బ్రేకప్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అన్న ప్రశ్న ఎదురయింది .. రోబోలా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు దీప్తి సునయన ..చెప్పిన తీరు చూస్తే ఇక షణ్ముఖ్ తో.. కలిసే ప్రసక్తే లేదు అంటూ ఫ్రెండ్స్ ఫిక్స్ అయిపోయారు. హౌస్ లో జరిగిన ఓవర్ రొమాన్స్ కారణంగానే వీళ్లు బ్రేకప్ చెప్పేసుకున్నారు. కాగా ప్రెసెంట్ షణ్ముఖ్ జస్వంత్ – దీప్తి సునయన తమ కెరియర్లపై కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు సాగుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news