MoviesBalayya బాల‌య్య కెరీర్‌లోనే బిగ్ రాంగ్ స్టెప్‌… బాషా లాంటి బ్లాక్...

Balayya బాల‌య్య కెరీర్‌లోనే బిగ్ రాంగ్ స్టెప్‌… బాషా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఎందుకు మిస్ అయ్యాడు..!

త‌ల‌రాత అనేది ప్ర‌తి మ‌నిషికి ఉంటుంది. దానిని ఎప్పుడూ ఎవ్వ‌రూ మార్చ‌లేరు. ఒక్కోసారి మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పులే బ‌య‌ట వాళ్ల‌కు పెద్ద వ‌రాలుగా మారుతూ ఉంటాయి. అవి మ‌న జీవితంలో స‌రిదిద్దుకోలేని త‌ప్పులు అవుతాయి. ఓ స్టైలీష్ ఆటోడ్రైవ‌ర్‌ కాస్తా అంత‌కుముందు పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ అన్న నిజం తెలిస్తే ఎలా ఉంటుంది ? అంత పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ జీవితంలో ఏం జ‌రిగింద‌న్న క‌థాంశంతో ర‌జ‌నీకాంత్ బాషా సినిమా వ‌చ్చింది.

సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా వ‌చ్చి రెండున్న‌ర ద‌శాబ్దాలు అవుతున్నా ఇప్ప‌ట‌కీ సినిమా చూస్తుంటే ఏదో కొత్త‌గా ఉంటుంది.. ఇప్ప‌ట‌కీ మ‌నం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అస‌లు ఈ సినిమా ఎంత గొప్ప ప్ర‌భావం చూపించిందో అర్థ‌మ‌వుతోంది. న‌గ్మా హీరోయిన్‌గా న‌టించింది. అప్ప‌ట్లో త‌మిళ ఇండ‌స్ట్రీని మాత్ర‌మే కాదు.. సౌత్ సినిమాను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా.

బాషాలో ర‌జ‌నీకాంత్ డైలాగులు, స్టైల్‌, ఆ యాక్టింగ్ అదుర్స్‌. ఇక త‌మిళంలో హిట్ అయ్యాక ఈ సినిమాను తెలుగులో కూడా తీయాల‌ని అనుకున్నారు. హైద‌రాబాద్‌లో ప్రివ్యూ షో వేశారు. ద‌ర్శ‌కుడు సురేష్‌కృష్ణ చిరంజీవి లేదా బాల‌య్య‌తో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నార‌ట‌. సురేష్ కృష్ణ అయితే బాల‌య్య‌కే ఈ క‌థ బాగా యాప్ట్ అవుతుంద‌ని చెప్పార‌ట‌.

అయితే బాల‌య్య‌కు అప్ప‌ట్లో రీమేక్ సినిమాలు చేయ‌డం ఏ మాత్రం ఇష్టం ఉండేదే కాదు. చేస్తే గీస్తే డైరెక్ట్ క‌థ‌ల‌తోనే సినిమాలు చేసి హిట్ కొట్టాల‌ని ఖ‌రాఖండీగా చెప్పేవాడు. బాల‌య్య‌ను చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు ఈ సినిమాను తెలుగులో డ‌బ్బ్ చేసి రిలీజ్ చేయాల‌ని త‌మిళ నిర్మాత‌లు డిసైడ్ అయ్యారు. అయితే తెలుగులో కూడా బాషా సూప‌ర్ హిట్ అయ్యింది.

అయితే ఆ త‌ర్వాత బాల‌య్య త‌న కెరీర్‌లో త‌మిళ్‌లో హిట్ అయిన సామీ లాంటి రీమేక్ సినిమాలు ల‌క్ష్మీన‌ర‌సింహాలో న‌టించారు. బాషా ను కూడా ఆయ‌న వ‌దులుకోకుండా తెలుగులో చేసి ఉంటే ఖ‌చ్చితంగా బాల‌య్య కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయి ఉండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news