MoviesAmigos యాంటి నందమూరి ఫ్యాన్స్ కూడా..ఆ ఒక్క దానికోసం "అమిగోస్" సినిమా...

Amigos యాంటి నందమూరి ఫ్యాన్స్ కూడా..ఆ ఒక్క దానికోసం “అమిగోస్” సినిమా చూసేయచ్చు..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రీసెంట్ గా నటించిన ఎక్స్ట్రార్డినరీ మూవీ అమిగోస్ . ఫస్ట్ టైం నందమూరి హీరో తన కెరియర్ లోనే ట్రిపుల్ రోల్ లో నటిస్తూ సంచలనానికి తెర తీశారు . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఊహించని ఆలోచించని కాన్సెప్ట్ తో జనాల ముందుకు రావడం బిగ్గెస్ట్ సాహసం అనే చెప్పాలి. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే .

అలాంటి వాళ్ళు ఎదురుపడితే జరిగే అనార్ధాలు .. అప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో చెప్పే యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించారు కొత్త డైరెక్టర్ రాజేందర్ రెడ్డి. పేరుకి కొత్త డైరెక్టర్ అయిన సరే ఎంతో ఎక్స్పీరియన్స్ గా తీసిన షాట్స్ జనాలకు విపరీతంగా నచ్చేసాయి . మరీ ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ ను సరికొత్త డిఫరెంట్ లుక్ లో చూపించడంలో నందమూరి ఫ్యాన్స్ కు బీభత్సంగా బుర్రకేసింది . అంతేకాదు ఆశికా రంగనాథ్ కూడా తన అందాలతో ఈ సినిమాను హిట్ చేయడానికి చాలా ట్రై చేసింది .

మరీ ముఖ్యంగా యాంటీ నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పొగిడేస్తూ ట్విట్టర్లో , ఇన్స్టా లో రివ్యూస్ ఇస్తున్నారు . అందరికీ కామన్ గా నచ్చిన ఒకే ఒక పాయింట్ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాట కొరియోగ్రఫీ.. గతంలో బాలకృష్ణ కెరియర్ లో హిట్గా నిలిచిన ఈ పాటను అమిగోస్ సినిమాలో రీమిక్ చేస్తూ కళ్యాణ్ రామ్ మంచి డెసిషన్ తీసుకున్నాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . కొరియోగ్రఫీ , విజువలైజేషన్ హీరో హీరోయిన్ యాక్టింగ్ రొమాన్స్ తెరపై జనాలకు విపరీతంగా నచ్చేసింది. అందుకే ఈ ఒక్క పాట కోసమైనా సరే కచ్చితంగా యాంటీ నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను చూడొచ్చు అంటూ స్ట్రాంగ్ కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news