MoviesSuma "తప్పు నాది కాదు..ఆయన చెప్పితేనే అలా అడిగాను"..బిగ్ బాంబ్ పేల్చిన...

Suma “తప్పు నాది కాదు..ఆయన చెప్పితేనే అలా అడిగాను”..బిగ్ బాంబ్ పేల్చిన సుమ..!?

ప్రజెంట్ సోషల్ మీడియాలో సుమ పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో మనందరికీ తెలిసిన విషయమే . కాగా ఎప్పుడూ తన మాటలతో తన చలాకితనంతో సరదా సరదాగా పంచస్ వేస్తూ .. స్టార్ సెలబ్రిటీస్ ని సైతం ఆకట్టుకునే సుమ.. రీసెంట్గా అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో టంగ్ స్లిప్ అయింది. ఏకంగా ఎన్టీఆర్ కి కోపం తెప్పించే విధంగా మాట్లాడింది . ఈ క్రమంలోనే తారక్ స్టేజి పైనే సుమకు ఇచ్చి పడేసాడు .

కాగా నందమూరి కళ్యాణ్రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా అమిగోస్. అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ ..ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఫిబ్రవరి 10న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్.. రీసెంట్ గానే హైదరాబాదులో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్ లో తారక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కి మించిపోయిన క్రేజ్ తో ఆయన పేరు స్టేడియంలో మారుమ్రోగిపోయింది. కాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉండగా.. సుమ ఆ విషయాన్ని చెప్పబోతూ ఎన్టీఆర్ థర్టీ పై కీలక అప్డేట్ ఇస్తాడు అంటూ పుసుకున్న టంగ్ స్లిప్ అయ్యింది.

ఇప్పటివరకు మనం గమనించినట్లయితే .. సుమ ఏనాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ టంగ్ స్లిప్ అవ్వలేదు . తన లిమిట్స్ లో తాను ఉంటూనే వచ్చింది . ఫస్ట్ టైం ఇలా టంగ్ స్లిప్ అయ్యింది. అప్పుడే కోప్పడిన ఎన్టీఆర్ ..”వాళ్లు అడగకపోయినా నువ్వే చెప్పేసేలా ఉన్నావు” అంటూ ఫైర్ అయ్యాడు . గత రెండు రోజులుగా ఇదే వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

కాగా రీసెంట్గా స్వయంగా ఎన్టీఆర్ కి సుమ కాల్ చేసి సారీ చెప్పినట్లు తెలుస్తుంది . “తాను కావలని అలా అడగలేదని ..ఈవెంట్ వాళ్లే అలా స్క్రిప్ట్ రాసి ఇచ్చారని ఆ కారణంగానే ఎన్టీఆర్ 30 గురించి నేను అడగాల్సి వచ్చిందని.. దానివల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే సారీ “అంటూ ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసే క్షమాపణలు చెప్పిందట. తారక్ కూడా ఈ విషయాన్ని అక్కడితో వదిలేసేయ్ అంటూ లైట్ గా తీసుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ఈవెంట్ మేనేజర్స్ ప్రమోషన్స్ కోసం ఏదైనా చేయగలరు .. ఎంతకైనా తెగించగలరు అని మరోసారి ప్రూవ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news