Moviesఆ స్టార్ హీరోపై త్రిషకు అంత మోజు ఎందుకు... ఏదో పెద్ద...

ఆ స్టార్ హీరోపై త్రిషకు అంత మోజు ఎందుకు… ఏదో పెద్ద ప్లానే వేసిందే..!

సీనియర్ హీరోయిన్ త్రిష 15 ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీని ఏలేసింది. త‌రుణ్ హీరోగా వ‌చ్చిన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగులో ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిన వ‌ర్షం సినిమాకు ఆమె మంచి బ్రేక్ ఇచ్చింది. అంతే ఇక ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. అటు స్టార్ హీరోలు చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున‌, వెంక‌టేష్‌… ఇటు కుర్ర స్టార్ హీరోలు ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ ప‌క్క‌న కూడా న‌టించేసింది.

ఐదారేళ్లు టాలీవుడ్‌లో అంద‌రి హీరోల ప‌క్క‌న వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది. త్రిష సినిమాలు ఒకానొక టైంలో వ‌రుస‌గా హిట్లు అవ్వ‌డంతో ఆమె గోల్డెన్ లెగ్ అయిపోయి మ‌న తెలుగోళ్ల‌కు పెద్ద సెంటిమెంట్ అయ్యింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత త్రిష సెకండ్ ఇన్సింగ్స్ కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా త్రిషకి బాగా కలిసొచ్చింది.

త్రిష వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దులు దాటేసినా ఆమె అందం మాత్రం చెక్కు చెద‌ర్లేదు. తాజాగా త్రిష న‌టించిన రాంగీ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో త్రిష సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌పై క్రేజీ కామెంట్స్ చేసింది. ర‌జ‌నీకాంత్ సార్ అంటే త‌న‌కు చాలా ఇష్టం అని.. ఆయ‌న‌తో ఫుల్ టైం హీరోయిన్‌గా న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది.

గ‌తంలో ర‌జ‌నీ – త్రిష కాంబినేష‌న్లో పేట సినిమా వ‌చ్చింది. ఇప్పుడు ఈ ముదురు ముద్దుగుమ్మ కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్‌, విజ‌య్ ప‌క్క‌న న‌టిస్తోంది. ఈ రెండు ఆమెకు మంచి ఆఫ‌ర్లు… ఈ టైంలో ర‌జ‌నీకాంత్‌తో మ‌రో సినిమా ప‌డితే త్రిష కెరీర్ మ‌రో మూడు, నాలుగేళ్లు చూసుకోవాల్సిన ప‌నే ఉండ‌దు. అందుకే ఆమె ర‌జ‌నీకి వ‌ల వేసేందుకు ఆయ‌న జ‌పం చేస్తోంద‌న్న గుస‌గుస‌లు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news