Moviesఅఫీషియ‌ల్‌: 3వ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన చిరు చిన్న కూతురు శ్రీజ‌.....

అఫీషియ‌ల్‌: 3వ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన చిరు చిన్న కూతురు శ్రీజ‌.. క‌ళ్యాణ్‌కు విడాకులు..!

మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల గత ఏడాదిన్నర కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి రకరకాల రూమర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలోనూ శ్రీజ ఎప్పుడు హాట్‌ టాపిక్ గా ఉంటూ వస్తోంది. అసలు శ్రీజ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ముందు నుంచి కూడా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం అలవాటు అయ్యింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించిన శ్రీజ.. ఇంట్లో వాళ్లకు తెలియకుండానే సీక్రెట్గా పెళ్లి చేసుకుంది.

వీరిద్దరి పెళ్లి అప్పట్లో పెద్ద రచ్చ లేపింది. ఈ దంపతులకు ఒక పాప పుట్టాక మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాన్నాళ్లపాటు చిరంజీవి ఇంట్లోనే ఉన్న శ్రీజకు చిరంజీవి – సురేఖ దంపతులు పట్టుబట్టి మరీ రెండో వివాహం చేశారు. తమ కుటుంబ సన్నిహితులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ రెండో పెళ్లి జరిగింది. కళ్యాణ్ శ్రీజ దంపతులకు కూడా ఒక కుమార్తె పుట్టింది.

ఆ త‌ర్వాత మెగా బ్రాండ్ స‌పోర్ట్‌తో క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త‌న మామ చిరంజీవి హిట్ సినిమా విజేత పేరు పెట్టుకునే తొలి సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే గత ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. క‌ళ్యాణ్‌దేవ్‌ను కూడా మెగా ఫ్యామిలీ ప‌ట్టించుకోవ‌డం మానేసింది. వీరిద్ద‌రు విడిపోతున్నార‌ని.. త్వ‌ర‌లోనే విడాకుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.. శ్రీజ మ‌రో వ్య‌క్తిని మూడో పెళ్లి కూడా చేసుకోబోతోంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే శ్రీజ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కొటేష‌న్లు చూస్తుంటే వీరిద్ద‌రి విడాకులు దాదాపు క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టుగానే అనుకోవాలి. ఆమె మూడో పెళ్లికి కూడా రెడీ అవుతున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా శ్రీజ గ‌తేడాది మూమెంట్స్ అంటూ రాసుకు వ‌చ్చింది. డియ‌ర్ 2022 నా జీవితంలో అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తిని క‌లిసేలా చేశావ్‌.. నా గురించి బాగా తెలిసిన వ్య‌క్తి… న‌న్ను అమితంగా ప్రేమిస్తూ.. కేరింగ్‌గా చూసుకునేవాడు.. క‌ష్ట సుఖాల్లో నాకు తోడు ఉండ‌డంతో పాటు… నాకు ఎప్పుడూ స‌పోర్టింగ్‌గా ఉండేవాడు… త‌న‌ను క‌ల‌వ‌డం అద్భుతం.. కొత్త ప్ర‌యాణం మొదలు కాబోతోంద‌ని శ్రీజ పోస్ట్ షేర్ చేసింది.

గ‌త యేడాదికి పైగా శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ ఎప్పుడూ క‌లిసి క‌నిపించ‌లేదు. వీరు విడిగానే ఉంటున్నారు. క‌ళ్యాణ్‌దేవ్‌ను కూడా మెగా ఫ్యామిలీ ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేసింది. రీసెంట్‌గా శ్రీజ త‌న కుమార్తె బ‌ర్త్ డే కూడా ఒంట‌రిగానే సెల‌బ్రేట్ చేసుకుంది. ఇప్పుడు కొత్త వ్య‌క్తితో కొత్త జీవితం ప్రారంభం అంటోందంటే ఆమె కొత్త లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news