Moviesఉపాసన గర్భం పై మెగా డాటర్ సంచలన కామెంట్స్.. సుస్మిత ఏంటి...

ఉపాసన గర్భం పై మెగా డాటర్ సంచలన కామెంట్స్.. సుస్మిత ఏంటి ఇలా అనేసింది..!?

మనకు తెలిసింది మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తల్లి కాబోతుంది. రామ్ చరణ్ తండ్రికి కాబోతున్నాడు . మెగా ఫాన్స్ , మెగా ఫ్యామిలీ గత పదేళ్ళుగా ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన మూమెంట్ ఎట్టకేలకు ఫైనల్ గా రివీల్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . మెగాకోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన మరోక్షణం నుండి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆమె సరోగసి ద్వార బిడ్డని కంటుందని..ఆమెకు ట్వీన్స్ పుడుతున్నారని.. ఆమెకు ఏదో ప్రాబ్లం ఉందని ..ఆ తర్వాత స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటుందని ..ఇలా నానా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే రీసెంట్గా రాంచరణ్ అక్క మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కారణంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్క సుస్మిత మాట్లాడుతూ ..రామ్ చరణ్ పుట్టబోయే పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది .

ఆమె మాట్లాడుతూ ..”మా తమ్ముడు తండ్రి కాబోతున్నాడని తెలిసిన మరో క్షణం మాకు చాలా హ్యాపీగా అనిపించింది . ఫ్యామిలీ మొత్తం కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాం . మా ఆనందానికి అవధులు లేవు . మా తమ్ముడికి పాపనా..? బాబు పుట్టినా..? ఓకే. కానీ నా వరకు చరణ్ కి బాబు పుట్టాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నాం ,,కొడుకు పుడితే ఆ కోరిక తీరిపోతుంది “అంటూ సంచలన కామెంట్స్ చేసింది . దీంతో సుస్మిత ఓపెన్ గా అలా అనేసింది ఏంటి అంటూ ఆమె మాటలను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news