Moviesశాకుంతలం : సమంత రోల్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్...

శాకుంతలం : సమంత రోల్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ స్టోరీ అనుకున్నప్పుడు ఫలానా హీరోని హీరోయిన్ ఊహించుకొని ఆ కథను రాసుకుంటారు. సినిమా కథ పూర్తి అయిన తర్వాత ఆ స్టోరీ ను సదరు హీరోకి హీరోయిన్ కి చెప్పినప్పుడు.. వాళ్ళకి కథ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ..నచ్చిన కొన్నిసార్లు సినిమా చేసే టైం ఉండకపోవచ్చు . అలా ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్లు మంచి మంచి కథలను మిస్ చేసుకుని ..ఆ కథలు వేరే హీరోల దగ్గరికి వెళ్లి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి .

కాగా తాజాగా అదే పొజిషన్లో మరోసారి రాబోతుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత . మనకు తెలిసిందే సమంత రీసెంట్ గా నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమాని ఒకప్పటి ఫేమస్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. కొన్నాళ్లు రాత్రి పగలు నిద్ర పోకుండా కష్టపడి తెరక్ర్క్కించిన ఈ సినిమా ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ట్రైలర్ అద్భుతంగా విజువల్ ఫీస్ట్ అనె చెప్పాలి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి విజువల్ ఫీట్ అంటే మాత్రం హీరోలకే పరిమితమవుతూ వచ్చింది.

కానీ ఫస్ట్ టైం స్టార్ హీరోయిన్ సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలోను ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ని పెట్టి ఆకట్టుకున్నాడు గుణశేఖర్ . అయితే ఈ సినిమా కథను అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ కథను చేయాలని బాగా ఆశపడ్డాడట గుణశేఖర్ .

అయితే ఆయన కూతురు నీలిమ గుణ మాత్రం ఈ కథను స్టార్ హీరోయిన్ సమంత చేస్తేనే కథకు అర్థం ఉంటుందని ..ఆమె ఈ పాత్రకి సెట్ అయినట్టు మరి ఎవరు సెట్ అవ్వరని సమంతను అప్రోచ్ అయ్యి కధను వివరించారట . సమంత కూడా మరో మాట మాట్లాడకుండా ఈ సినిమాకు సైన్ చేసి తన కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేసిందట. ఏది ఏమైనా సరే శకుంతల పాత్రలో సమంత సెట్ అయినట్టు నయనతార సెట్ అవ్వదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి సమంత ఈ సినిమా ద్వార ఎలాంటి హిట్ ని అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news