Movies"తాట తీస్తా నా కొడకా".. బండ్ల గణేష్ దుమ్ము దులిపేసిన జబర్ధస్త్...

“తాట తీస్తా నా కొడకా”.. బండ్ల గణేష్ దుమ్ము దులిపేసిన జబర్ధస్త్ కామెడీయన్ షకలక శంకర్..!!

సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తనదైన స్టైల్ లో కామెడీగా పేరు సంపాదించుకుంటూ ..మరోపక్క ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా మారి మంచి మంచి సినిమాలను ప్రొడ్యూస్ చేసి ప్రాఫిట్స్ అందుకున్నాడు . కాగా ఈ మధ్యకాలంలో కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ బండ్ల గణేష్ .. ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉన్నాడు .

అంతకుముందు రాజకీయాలలో పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ..ఆ తర్వాత విజయ్ దేవరకొండ ..ఇప్పుడు రవితేజ ఇలా వరుసగా స్టార్స్ ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ధమాకా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఆయన రవితేజ ను ఓ రేంజ్ లో పొగిడేసారు . రవితేజ స్వయంకృషితో పైకొచ్చాడని చెప్పే క్రమంలో… ఒకటి రెండేళ్లు కష్టపడి అదృష్టం కలిసొచ్చి కొందరు మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ అయిపోతారు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన, చివరికి ప్రొడక్షన్ బాయ్ గా అయినా పరిశ్రమలోనే ఉంటానని స్టార్ అయ్యాడు, అని అన్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే మెగాస్టార్ , సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ బండ్ల గణేష్ మాటలపై పరోక్షంగా రియాక్ట్ అయ్యారు . ఆయన మాట్లాడుతూ..” మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకూడదు.. బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి .. మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ అదృష్టం కొద్దీ అవరు. దానికి ఏళ్ల తరబడి కృషి ఉండాలి. అన్నం నీళ్లు లేక, నిద్ర లేక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తే స్టార్స్ అవుతారు.ఈ మాటలు ఎవరికీ తగలలో వాళ్లకు తెలుసు ” అంటూ పేరు చెప్పకుండా పరోక్షంగా బండ్ల గణేష్ కి తగిలేలా మాట్లాడాడు అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైన ఈ మధ్య కాలంలో బండ్ల నోటి దూకుడు ఎక్కువైందిఅని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news