Moviesప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న రాజమౌళికి..దాన్ని చూస్తే గజ గజ వణుకు..!!

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న రాజమౌళికి..దాన్ని చూస్తే గజ గజ వణుకు..!!

మనిషి పుట్టుక పుట్టాక ఎమోషన్స్ కామన్ . ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది . పైకి పెద్ద స్టార్ హీరోగా కనిపిస్తున్నంత మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు . మనలాగే ఇష్ట ఇష్టాలు ..భయం కోపాలు అన్ని ఉంటాయి .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అంతటి పెద్ద స్టార్ డైరెక్టర్ ఇంత చిన్న విషయానికి భయపడతాడా షాకింగ్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ఆరారార్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. గోల్డెన్ గ్లోబల్ అవార్డు అందుకుంది ..రీసెంట్గా కీరవాణికి పద్మశ్రీ అవార్డు వచ్చింది.

ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ గుడ్ న్యూస్ లు వింటూ సోషల్ మీడియాని షేర్ చేస్తున్న రాజమౌళి చిన్న పాము ని చూస్తే వణికి పోతాడట . అదేంటో తెలియదు చిన్నప్పటినుంచి ఆయనకి పాము అంటే భయమట . ఆశ్చర్యమేంటంటే ఇప్పటికీ ఆయన పామును చూస్తే గజగజ వణికిపోతూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ విషయం కారణంగా ఎన్నోసార్లు ఎన్టీఆర్ రాజమౌళిని ఆటపట్టించాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news