Movies"ఇక పై అలా చేస్తే సహించను"..రజినీకాంత్ స్ట్రైట్ వార్నింగ్..!!

“ఇక పై అలా చేస్తే సహించను”..రజినీకాంత్ స్ట్రైట్ వార్నింగ్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ వాళ్ళ పర్మిషన్ లేకుండానే వివిధ బ్రాండ్స్ కు ప్రమోట్ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరో రజనీకాంత్ ఫొటోస్ ను పలు ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా పర్మిషన్ తీసుకోకుండానే ఆయన ఫోటోలని ప్రచూరిస్తూ.. తప్పుడు యాడ్స్ కి వాడుతున్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ లాయర్ సుబ్బయ్య రియాక్ట్ అయ్యారు.


రజనీకాంత్ తరఫున సుబ్బయ్య మాట్లాడుతూ..”కొన్ని దశాబ్దాలకు పైగా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉంటుంది . కాగా పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్న రజనీకాంత్ .. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కొందరు తప్పుడు యాడ్స్ కి ఆయన పర్మిషన్ లేకుండా అయిన ఫోటోలు వాడుతున్నారు “.

ఆయన పరువు కి నష్టం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది “అంటూ హెచ్చరించారు . తాజాగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పాటు పలు కంపెనీల్లో రజనీకాంత్ పేరును వాయిస్ ను వాడుకుంటూ ఆయన ఇమేజ్ ని కించపరుస్తున్నారు . ఈ క్రమంలోనే రజనీకాంత్ తరపు లాయర్ సుబ్బారావు అలాంటి వాళ్ళకి స్ప్రైట్ వార్నింగ్ ఇచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news