Moviesఅద్గది.. బాలయ్య అంటే అదేరా.. ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూతపడ్డాయిగా..!!

అద్గది.. బాలయ్య అంటే అదేరా.. ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూతపడ్డాయిగా..!!

సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సిం హం బాలయ్య కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం సినిమా స్టార్ హీరోలే కాదు రాజకీయపరంగా సామాన్య జనాలు కూడా నందమూరి బాలయ్య బిహేవియర్ కి, ఓపెన్ కామెంట్స్ కి ఫిదా అవుతుంటారు . మంచి పని చేస్తే శభాష్ అంటూ చప్పట్లు కొట్టే ఆ చేతులే..చెడ్డ పని చేస్తే చంపచోళ్ళు అనిపిస్తుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

 

బాలయ్య గురించి చిన్నపిల్లాడి ని అడిగిన ఈ విషయం టక్కున చెప్పేస్తాడు. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే . వీర సింహారెడ్డి సినిమా విషయంలోనూ అదే ట్రోలింగ్ హైలెట్ చేస్తూ కొందరు ఓవర్ యాక్టింగ్ చేశారు. అయితే అవన్నీ తిప్పి కొడుతూ నందమూరి ఫ్యాన్స్ వీరసింహారెడ్డిని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ వద్ద నిల్చోబెట్టారు . అలాంటి వాళ్ళ నోరు మూయిస్తూ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న సందీప్ కిషన్ తదుపరి సినిమాకి తన వంతు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యాడు .

కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కి ..సందీప్ హీరోగా నటించిన మైఖేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు . ఇదే విషయాన్ని సందీప్ కిషన్ అఫీషియల్ గా ప్రకటించాడు .విజయ్ సేతుపతి , అనసూయ , దివ్యాంశ కౌశిక్ , వరలక్ష్మి , గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ జనవరి 23న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.

కాగా ఫిబ్రవరి 3న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది . దీంతో గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలిచే బాలయ్య చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతుండడం చాలా హ్యాపీ గా ఉంది అంటూ సందీప్ కిషన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చాడు . దీంతో బాలయ్య ఆయనను విమర్శించే వాళ్ళ నోరులు మూయించాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news