Movies"ఇంత ప్రేమ అప్పుడు ఏమైంది..?"..అడిగి కడిగేసిన బాలయ్య..!!

“ఇంత ప్రేమ అప్పుడు ఏమైంది..?”..అడిగి కడిగేసిన బాలయ్య..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం ..భూతద్దంలో పెట్టి చూడడం చాలా కామన్ గా అయిపోయింది . మరీ ముఖ్యంగా పేరు గల పెద్ద మనుషులు ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలయ్య వీరరసింహారెడ్డి సెలబ్రేషన్స్లో భాగంగా అక్కినేని తొక్కనేని అంటూ టంగ్ స్లిప్పయ్యారు . పొరపాటున ఈ మాట అన్నానురా మహాప్రభో అంటున్న సరే కొంతమంది నెటిజెన్స్ కావాలని బాలయ్యను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య సైతం ఎన్టీఆర్ – ఏఎన్నార్ – ఎస్వీఆర్ కళామతల్లి బిడ్డలు అని అలాంటి వాళ్ళను దూషిస్తే మనల్ని మనం కించపరచుకున్నట్లే అంటూ కౌంటర్ వేశారు . ఈ క్రమంలోనే బాలయ్య కూడా తన మాటలపై క్లారిటీ ఇచ్చాడు . రీసెంట్ గా హిందూపూర్ లో ప్త్రెస్ మీట్ లో మాట్లాడుతూ ..తన మాటలను సమర్ధించుకున్నాడు . “పొరపాటున యాదృచ్ఛికంగా ఆ మాటలు నా నోటి నుంచి వచ్చాయి కానీ కావాలని వాంటెడ్ గా ఏది మాట్లాడలేదని .. నాగేశ్వరరావు గారు అంటే నాకు ఎంతో గౌరవం అంటూ చెప్పుకొచ్చారు “.

Naga Chaitanya, Akhil condemn Balakrishna's comment on their grandfather - Hindustan Times

ఈ క్రమంలోనే బాలయ్యను మరింతగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నో రాద్దాంతాలు జరుగుతున్నాయి.. క్యాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు ఓపెన్ గా పలనా హీరో , డైరెక్టర్ మమ్మల్ని వాడుకున్నారు అంటూ చెబుతున్నారు . అలాంటప్పుడు ఆ లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏం అంటూ నందమూరి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు బాలయ్య ఫేమ్ డి గ్రేట్ చేయడానికి ఇలా కావాలని కొందరు టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే బాలయ్య ను తగ్గించే విధంగా .. బాలయ్యను ట్రోల్ చేస్తే ఒప్పుకునేదే లేదు అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు..!!

Latest news