Moviesఅక్కినేని VS బాలయ్య ఫ్యాన్స్ వార్: ఆ టైం కోసం వెయిట్...

అక్కినేని VS బాలయ్య ఫ్యాన్స్ వార్: ఆ టైం కోసం వెయిట్ చేస్తున్న అంటున్న మహేశ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే . వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా నందమూరి బాలయ్య మాట్లాడుతూ.. అక్కినేని తోక్కినేని అంటూ టంగ్ స్లిప్పయ్యారు . ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడిన మాటలపై పరోక్షంగా స్పందించాడు నాగచైతన్య .

ఎన్టీఆర్ , ఏఎన్నార్ , ఎస్వీఆర్ అందరు కళామ తల్లి బిడ్డలు అని ..అలాంటి వాళ్ళని కించపరిస్తే మనల్ని మనమే కించపరచుకున్నట్లు అంటూ బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాకపోతే ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు పెద్దలు కూడా బాలయ్య మాటలను తప్పుపడుతున్నారు. మరి కొంతమంది బాలయ్య సరదాగా అన్నారు అంటూ బాలయ్యను సపోర్ట్ చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే మహేష్ బాబు దీనిపై ఏం మాత్రం స్పందించకుండా మంత్రి కేటీఆర్ ను అభినందిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది . హైదరాబాద్ కి ఫార్ములా రేస్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు మహేష్ బాబు . హైదరాబాదులో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడం గర్వకారణం అంటూ ఓ రేంజ్ లో పొగడేసారు.  ఫిబ్రవరి 11న జరిగే గ్రీన్ కో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు..ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలో ఇంత గొడవ జరుగుతుంటే చలనం లేకుండా మంత్రి కేటీఆర్ ను పోగడటం ఏంటి అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . ఈ క్రమంలోని మహేష్ బాబు పేరుని ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news